TDP Alliance : బీజేపీతో పొత్తుపెట్టుకుని తన గొయ్యి తానే తవ్వుకున్న టీడీపీ, జనసేన
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని(Jagan Mohan Reddy) ఓడించడం తనొక్కడి వల్ల కాదని తెలుసుకున్న టీడీపీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) తెలివిగా పవన్‌కల్యాన్‌ను(Pawan Kalyan) తనవైపుకు లాగేసుకున్నాడు. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న సమయంలోనే జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని(Jagan Mohan Reddy) ఓడించడం తనొక్కడి వల్ల కాదని తెలుసుకున్న టీడీపీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) తెలివిగా పవన్‌కల్యాన్‌ను(Pawan Kalyan) తనవైపుకు లాగేసుకున్నాడు. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న సమయంలోనే జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించేశారు. పవన్‌తో కలిసినప్పటికీ బలం సరిపోవడం లేదని గ్రహించిన చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ(BJP) పెద్దలను బతిమాలుకుని కూటమికి తెరతీశారు. బీజేపీతో పొత్తు వద్దని పార్టీకి చెందిన సీనియర్లు చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. కేసుల నుంచి రక్షణ కోసం చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని సొంత పార్టీ నేతలే అప్పుడు అనుకున్నారు. నిజానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు, లోకేశ్‌లకు తప్ప ఎవరికీ పెద్దగా ఇష్టం లేదు. బీజేపీతో పొత్తు కుదర్చడంలో తనదే ముఖ్య భూమిక అంటూ చెబుతూ వస్తున్న పవన్‌పై టీడీపీ క్యాడర్‌కు పీకల్దాక కోపం ఉంది.
అందుకు కారణం బీజేపీ అగ్రనేతలు వ్యవహరిస్తున్న తీరు. గత నాలుగు రోజులుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముస్లింలపై పలు విమర్శలు చేస్తున్నారు. ప్రధాని పదవిలో ఉన్న విషయం కూడా మర్చిపోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఇతర ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఇది తెలుగు రాష్ట్రాలలోని ముస్లిం సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పించంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తే తాము భారీగా నష్టపోతామని ముస్లింలు ఆందోళన చెందుతున్నారు. బీజేపీపైనే కాదు, ఆ పార్టీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న టీడీపీ, జనసేనలపై కూడా మండిపడుతున్నారు. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోదీ, అమిత్ షా(amit shah) ఎన్నికల ప్రచారాల్లో ప్రకటిస్తుంటే ఇటు తెలుగుదేశంపార్టీ కానీ, అటు జనసేన కానీ ఖండించకపోవడాన్ని ముస్లింలు తప్పుపడుతున్నారు. మొన్నటి వరకు టీడీపీ, జనసేనకు అండగా నిలిచిన ముస్లింలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ముస్లిం సామాజికవర్గం ఆ రెండు పార్టీలకు దూరమైనట్టే అనుకోవాలి. రాయలసీమలోనే కాదు, గుంటూరు, కృష్ణా జిల్లాలలోని కొన్ని నియోజకవర్గాలలో ముస్లింలు గెలుపోటములను నిర్ణయిస్తారు. మొత్తానికి టీడీపీ, జనసేనలకు ముస్లింలు పెద్ద హ్యాండే ఇవ్వబోతున్నారు.