ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi liquor case) ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో(ED Custody) ఉన్న బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కస్టడీ సోమవారంతో ముగిసింది.ఇవాళ ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపరచనున్నారు. ఆమె కస్టడీని మరోసారి పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది. అలాగే సుప్రీం కోర్టు సూచనతో ఆమె వేసిన బెయిల్ పిటిషన్‌పైన కూడా ఇవాళ అదే కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi liquor case) ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో(ED Custody) ఉన్న బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కస్టడీ సోమవారంతో ముగిసింది.ఇవాళ ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపరచనున్నారు. ఆమె కస్టడీని మరోసారి పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది. అలాగే సుప్రీం కోర్టు సూచనతో ఆమె వేసిన బెయిల్ పిటిషన్‌పైన కూడా ఇవాళ అదే కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కవితను పదిరోజుల పాటు విచారించింది ఈడీ. ఈ కేసులో అప్రూవర్‌లుగా మారిన వారు ఇచ్చిన సమాచారాన్ని కవిత ముందు పెట్టి ప్రశ్నలు అడుగుతూ వెళ్లారు ఈడీ అధికారులు. ఇతర నిందితులతో ఆమె జరిపిన వాట్సాప్ ఛాటింగ్‌లపై ఆరా తీశారు. ఇదిలా ఉంటే తన అరెస్ట్ అక్రమమంటూ మొదటి నుంచి చెబుతున్న కవిత న్యాయపోరాటానికి దిగారు. కవిత వేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు(Supreme court) తోసిపుచ్చింది. రాజకీయ నేతలు అయినంత మాత్రాన మినహాయింపు ఉండబోదని, విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో ట్రయల్ కోర్టులోనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, మహిళ కాబట్టి ఆమె పిటిషన్‌ను త్వరగతిన పరిశీలించాలని కింది కోర్టుకు(రౌస్ అవెన్యూ కోర్టు) సూచించింది.