లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఏకాభిప్రాయం కాదా? ఎన్నిక జరగాల్సిందేనా?

లోక్‌సభ స్పీకర్‌(Lok sabha speaker) ఎన్నిక ఈ నెల 26వ తేదీన జరుగుతుంది. ప్రస్తుతం లోక్‌సభలో ఇండియా కూటమి బలం పెరిగింది. తమకు డిప్యూటీ స్పీకర్‌ పదవి అయినా ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నది విపక్ష కూటమి. తమ డిమాండ్‌ను కాదంటే మాత్రం స్పీకర్‌ ఎన్నిక నిర్వహించాల్సిందేనని పట్టుబడుతున్నది. అదే జరిగితే స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి స్పీకర్‌ ఎన్నిక(Lok sabha Speaker Elections) జరుతుంది. స్వాతంత్య్రానికి ముందు పార్లమెంట్‌ను సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ అనేవారు. 1925 నుంచి 1945 మధ్య కాలంలో ఆరుసార్లు స్పీకర్‌ ఎన్నిక జరిగింది. విఠల్‌భాయ్‌ జే పటేల్ రెండుసార్లు విజయం సాధించారు. మహ్మద్‌ యాకూబ్‌, ఇబ్రహీం రహ్మతొల్లా, షణ్ముఖం షెట్టి, సర్‌ అబ్దుల్ రహీమ్‌, జి.వి.మావలంకర్‌లు ఒక్కోసారి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. భారత రాజ్యంగం అమలులోకి వచ్చిన తర్వాత పార్లమెంట్‌ తాత్కాలిక స్పీకర్‌గా జి.వి.మావలంకర్‌ కొనసాగారు. 1952లో దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత లోక్‌సభ, రాజ్యసభలు ఏర్పడ్డాయి. 1956లో మావలంకర్‌ చనిపోయారు. దాంతో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న అయ్యంగార్‌ స్పీకర్‌ పదవిని చేపట్టారు. 1957 ఎన్నికల తర్వాత కూడా అయ్యంగారే స్పీకర్‌గా నియమితులయ్యారు. అప్పట్నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతూ వస్తున్నది. ఎంఏ అయ్యంగార్‌, జీఎస్‌ ధిల్లాన్‌, బలరాం జాఖడ్‌, జీఎంసీ బాలయోగి మాత్రమే రెండుసార్లు స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

Eha Tv

Eha Tv

Next Story