గాలి వాటం ముఖ్యమంత్రిగా బీహార్(Bihar) సీఎంకు ఇప్పటికే ముద్రపడింది. నేతలు కండువా కప్పుకున్నంత ఈజీగా కూటములనే మార్చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ..సీఎం నితీష్ కుమార్(CM Nitish Kumar) ఏ క్షణమైనా రాజీనామా చేస్తారన్న ప్రచారంతో బీహార్ రాజకీయం మళ్లీ వేడెక్కింంది. గత పదేళ్లలో సీఎం సీటు దక్కడమే లక్ష్యంగా కూటముల్ని మారుస్తూ వస్తున్న నితీష్..ఈ సారి కూడా అదే ప్లాన్ వేశారా?

గాలి వాటం ముఖ్యమంత్రిగా బీహార్(Bihar) సీఎంకు ఇప్పటికే ముద్రపడింది. నేతలు కండువా కప్పుకున్నంత ఈజీగా కూటములనే మార్చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ..సీఎం నితీష్ కుమార్(CM Nitish Kumar) ఏ క్షణమైనా రాజీనామా చేస్తారన్న ప్రచారంతో బీహార్ రాజకీయం మళ్లీ వేడెక్కింంది. గత పదేళ్లలో సీఎం సీటు దక్కడమే లక్ష్యంగా కూటముల్ని మారుస్తూ వస్తున్న నితీష్..ఈ సారి కూడా అదే ప్లాన్ వేశారా? మరి ఈ తతంగాన్ని చూస్తూ..లాలూ ప్రసాద్ యాదవ్(Lallu Prasad yadav) సైలెంట్‎గా ఉంటారా? నితీష్‎కు షాకిస్తారా?

గాలి ఎటు వీస్తున్నదో... అది ఏ గమ్యం చేరుతుందో బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌కు తెలిసినంతగా దేశంలో మరే నాయకుడికీ తెలియదంటే అతిశయోక్తికాదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆయన మరోసారి ఈ విన్యాసానికి తెరలేపారు. విపక్ష ఇండియా కూటమి(India Alliance) ఏర్పాటులో చొరవ తీసుకుని, నాలుగైదు సమావేశాలకు కూడా హాజరైన నితీశ్‌ కుమార్.. మరోసారి ఎన్డీయే కూటమిలోకి చేరేందుకు చాపకింద నీరులా అడుగులు వేస్తున్నారు. బీహార్‎లో ఎక్కువ కాలం పని చేసిన ముఖ్యంమంత్రిగా నితీష్ కుమార్ రికార్డు సాధించారు. అయితే..ఆయన రాజకీయ నిర్ణయాలే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకసారి బీజేపీ..మరోసారి కాంగ్రెస్ కూటమి..ఇలా 2013 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఎన్డీయేలో చేరిన నితీష్ కుమార్..మళ్లీ ఇప్పుడు అదే కూటమికి దగ్గరవుతున్నారు. 2014లో బీజేపీకి గుడ్ బై చెప్పిన నితీష్..బీజేపీతో(BJP) ఉన్న పదిహేనేళ్ల తెగతెంపులు చేసుకున్నారు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ తన వ్యూహాన్ని మార్చుకున్నారు.

తన చిరకాల ప్రత్యర్థి లాలూప్రసాద్ యాదవ్‎తో చేతులు కలిపారు. ఆ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించింది. దీంతో నితీష్‎కుమార్ మరోసారి సీఎం కుర్చీ దక్కించుకున్నారు. లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్‎ను డిప్యూటీ సీఎంను చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 2017లో నితీష్ కుమార్ మహాకూటమికి షాకిచ్చారు. ఐఆర్‎సిటీసి స్కామ్‎లో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పేరు తెరపైకి రావడంతో సీఎం పదవికి నితీష్ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే ఎన్డీయేలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2021లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగి విజయం సాధించడంతో సీఎం సీటు మళ్లీ నితీష్ కుమార్ కే దక్కింది. రెండేళ్ల తర్వాత బీజేపీతో సమస్యలు తలెత్తగానే.. 2022లో నితీష్ కుమార్ మరోసారి సీఎం పదవికి రాజీనామా చేశారు. గంటల వ్యవధిలోనే ఆర్జేడీ, కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తేజస్వీని మళ్లీ డిప్యూటీ సీఎంను చేశారు. ఇలా కూటమిని ఎప్పుడంటే అప్పుడే మార్చి..ఎటు గాలి వీస్తే అటు వెళ్లిపోయే లీడర్‎గా తెచ్చుకున్నారు నితీష్ కుమార్. పొత్తు ఎవరితో ఉన్నా..ఏ కూటమిలో ఉన్నా సీఎం పదవిని మాత్రం దక్కించుకుంటున్నారు. ఈసారి కూడా అదే ప్లాన్ వేశారా? లేదంటే.. కొత్త ట్విస్ట్ ఏమైనా ఉంటుందో చూడాలి మరి !

Updated On 27 Jan 2024 2:07 AM GMT
Ehatv

Ehatv

Next Story