భార్య (Wife) ఐదో పెళ్లి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త (Husband) నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) ఇండోర్‌లో (Indore) ఈ ఘటన జరిగింది.
భార్య (Wife) ఐదో పెళ్లి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త (Husband) నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) ఇండోర్‌లో (Indore) ఈ ఘటన జరిగింది. ఇండోర్‌కు చెందిన 35ఏళ్ల సునీల్ లోహానీ (Sunil Lohani) 2018లో ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు సునీల్ నాలుగో భర్త. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో గత ఏడాది ఆమె తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. అక్కడే నివసిస్తున్న ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తన భార్య ఐదో వివాహం చేసుకున్న సంగతి సునీల్‌కు తెలిసింది. దాంతో తీవ్రంగా కలత చెందాడు. వారంకిందట ఓ సూసైడ్ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. తర్వాత ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుపెట్టుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. అయితే కట్నం కోసం వేధిస్తున్నాడంటూ సునీల్‌పై ఆమె పోలీసులకు కంప్లయింట్ చేసిందట! కోర్టు కేసుతో విసిగిపోయిన సునీల్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.