ఆయన ఓ రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌(IAS) అధికారి. పెళ్లయిన నాటి నుంచి ఇంత వరకు కూరగాయలు(vegetables) కొన్నారో లేదో తెలియదు.

ఆయన ఓ రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌(IAS) అధికారి. పెళ్లయిన నాటి నుంచి ఇంత వరకు కూరగాయలు(vegetables) కొన్నారో లేదో తెలియదు. అయితే తన భార్య చేసిన పనిని బట్టి ఆయన కూరగాయలు కొనలేదనే అనిపిస్తుంది. మార్కెట్‌కు వెళ్తున్న తన భర్తకు కూరగాయలు ఎలా కొనాలో అంటూ ఓ గైడ్‌లైన్స్‌ రాసిచ్చింది(Gudilines). ప్రతి ఒక్క కూరగాయకు నిర్దిష్ట పరిమాణం, అవి ఎలా ఉండాలో తెలియజేస్తూ పేపర్‌పై రాసి భర్తకు అందించింది. ఈ ఫొటోను తన భర్తే ఎక్స్‌లో పంచుకున్నారు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది.

మోహన్‌ పర్గైన్ రిటైర్డ్ ఇండియన్ ఫారిన్ అధికారి. ఆయన ఎక్స్‌లో ఒక ఫొటోను షేర్‌ చేశారు. కూరగాయలు కొనేందుకు తన భార్య ఓ పేపర్‌ మీద రాసిన కాగితాన్ని ఆయన పంచుకున్నారు. అందులో ప్రతీ కూరగాయకు కొలతలు, సైజ్, కలర్‌ అన్నీ సూచించింది. సరైన కూరగాయలు కొనేందుకు కావాల్సిన అన్ని సూచనలు చేసింది. టమాటాలు పసుపు, కొంత ఎరుపు ఉండాలని, అవి వదులుగా, వాటిపై రంధ్రాలు ఉండకూడదని సూచించింది. ఉల్లిగడ్డలు చిన్న సైజ్‌ ఉండాలని, పెద్దసైజ్‌ ఉండని ఉల్లిగడ్డలు వద్దని బొమ్మ గీసి మరీ చెప్పింది. ఆలుగడ్డలు మీడియం సైజులో ఉండాలని, వాటిపై ఆకుపచ్చని తోకలు ఉంటే తీసుకోకూడదని చెప్పింది. మేతి కూర ఆకులు పచ్చగా ఉండాలని, దాని ఎత్తు తక్కువగా ఉండాలని పేపర్‌పై రాసింది. పాలు, పేరుగు కూడా ఒక బ్రాండ్‌వే తీసుకోవాలని, మరో బ్రాండ్‌కు అనుమతి లేదని తెలిపింది. మిర్చి, పాలకూరలకు ఇలాంటి సూచనలే చేసింది. ఈ పేపర్‌ను మోహన్‌ పర్గైన్‌ ఎక్స్‌లో పంచుకొని..' నేను మార్కెట్‌కు వెళ్తున్నప్పుడు.. నా భార్య ఇలా రాసి ఇచ్చిందని.. ఇది మీకు కూడా ఉపయోగపడొచ్చని' రాసుకొచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story