ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని మెయిన్‌పురి(Mainpuri)లో ఓ భార్యామణి భర్తకు షాకిచ్చింది. షాకివ్వడమంటే యూట్యూబ్ థంబ్‌నెయిల్(Youtube Thumbnail)లో ఉండే షాక్ కాదు. నిజంగానే షాకిచ్చి చిత్రహింసలు పెట్టింది. అసలేం జరిగిందంటే మెయిన్‌పురికి చెందిన బేబీ యాదవ్(Baby Yadav), ప్రదీప్‌సింగ్(Pradeep Singh) భార్యాభర్తలు.

Uttar Pradesh
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని మెయిన్‌పురి(Mainpuri)లో ఓ భార్యామణి భర్తకు షాకిచ్చింది. షాకివ్వడమంటే యూట్యూబ్ థంబ్‌నెయిల్(Youtube Thumbnail)లో ఉండే షాక్ కాదు. నిజంగానే షాకిచ్చి చిత్రహింసలు పెట్టింది. అసలేం జరిగిందంటే మెయిన్‌పురికి చెందిన బేబీ యాదవ్(Baby Yadav), ప్రదీప్‌సింగ్(Pradeep Singh) భార్యాభర్తలు. ఈ దంపతులకు 14 ఏళ్ల కొడుకు ఉన్నాడు. బేబీ యాదవ్ గత కొన్నాళ్లుగా ఎక్కువకాలం ఫోన్‌తోనే గడుపుతోంది. ఓ వ్యక్తితో గంటలతరబడి మాట్లాడుతోంది. ఇది పద్దతి కాదంటూ భర్త ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె లైట్ తీసుకుంది. అదే పనిగా ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంది. ఇక లాభం లేదనుకుని అత్తమామలకు ఈ విషయం చెప్పాడు ప్రదీప్‌సింగ్. ఆమె నుంచి ఫోన్ లాగేసుకోవడం కంటే చేసేది మాత్రం ఏముందంటూ అత్తమామలు సలహా ఇచ్చారు. వారి సూచన మేరకు ఆమె నుంచి ఫోన్ తీసేసుకున్నాడు ప్రదీప్‌సింగ్. అప్పట్నుంచి భర్తపై కోపం పెంచుకుంది. గతవారం అతడికి మత్తుమందు ఇచ్చింది. తర్వాత అతడిని మంచానికి కట్టేసి ఇష్టం వచ్చినట్టు కొట్టింది. అంతటితో ఆగకుండా పలు మార్లు కరెంట్ షాక్ ఇచ్చింది. అడ్డుకోబోయిన తన కుమారుడిని కూడా చితక్కొట్టింది. ఎలాగోలా బేబీ యాదవ్ నుంచి తప్పించుకున్న ప్రదీప్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బేబీ యాదవ్‌పై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె గురించి వెతుకుతున్నారు.
