ఎప్పుడూ భార్యలను కొట్టే భర్తలేనా? భర్తలను చితకబాదే భార్యలు ఉండరా? ఎందుకుండరు?
ఎప్పుడూ భార్యలను కొట్టే భర్తలేనా? భర్తలను చితకబాదే భార్యలు ఉండరా? ఎందుకుండరు? ఉంటారు మహారాష్ట్ర(Maharasta)లోని పుణె(Pune)లో ఉన్న సోమవారం పేటలో ఇలాంటి భార్యామణి ఉంది. పాపం నానెట్టిన శనగలు తినడానికి నిరాకరించాడని భర్తను చితక్కొట్టింది. బండబూతులు తిట్టింది. కర్రతో బాదింది. మిక్సీ జార్‌తో తలపై రెండు ఇచ్చుకుంది. అక్కడితో ఆగలేదు. భర్త చేతి వేలిని కూడా కొరికేసింది. ముఖంపై గోళ్లతో రక్కేసింది. ఎడమ చెవి వెనుక భాగంలో రక్తం వచ్చేలా రక్కింది. ఆమె నుంచి ఎలాగోలా తప్పించుకుని పోలీసుల దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు బాధిత భర్త! సోమవార్ పేట(Somavar peta)లోని త్రిశుండ గణపతి ఆలయంలో 44 ఏళ్ల భర్త, 40 ఏళ్ల భార్య ఉంటున్నారు. మొన్న రాత్రి నానబెట్టిన శనగల విషయంలో ఇద్దరికి గొడవ జరిగింది. శనగలు తినాలని భార్య ఇస్తే తినకండా వద్దనేశాడు. తనకు ఇష్టం లేదని చెప్పాడు. దాంతో భార్యకు విపరీతమైన కోపం వచ్చింది. బూతులు తిట్టడం మొదలు పెట్టింది. భర్త ఎదురుతిరగడంతో మరింత రెచ్చిపోయింది. సుత్తితో కొట్టడానికి ప్రయత్నించింది. భర్త ఆ సుత్తిని లాగేసుకోవడంతో పక్కనే ఉన్న మిక్సీ జార్‌తో తలపై బాదింది. తలకు చేతులు అడ్డం పెట్టుకున్న భర్త వేలిని కసుక్కమని కొరికేసింది. కర్ర పుచ్చుకుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టింది. చెవిని కూడా కొరికింది. ఎలాగోలా భార్య నుంచి తప్పించుకుని స్థానిక పోలీసుల దగ్గరకు వెళ్లాడు. విచారణకు వస్తాం ఇంటికెళ్లమని పోలీసులు చెబితే గడగడమని వణికిపోయాడు. ఇంటికెళితే చావగొడుతుందని, ఇక్కడే ఉంటానని పోలీసులను బతిమాలుకున్నాడు. పాపం కదూ!