ఈరోజుల్లో కొందరు ఆడవారు మరీ రెచ్చిపోతున్నారనేదానికి ఈ ఉదంతమే నిదర్శనం. ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో అంటూ.. ఒకరిని ప్రేమిస్తారు..

ఈరోజుల్లో కొందరు ఆడవారు మరీ రెచ్చిపోతున్నారనేదానికి ఈ ఉదంతమే నిదర్శనం. ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో అంటూ.. ఒకరిని ప్రేమిస్తారు.. మరొకరిని అయిష్టంగా పెళ్లి చేసుకుంటారు. మళ్లీ ప్రియుడే కావాలంటూ భర్తను లేపేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో జరిగింది. దిలీప్ (25) భర్తను హత్య చేసిన కేసులో ఒక మహిళ, ఆమె ప్రేమికుడిని అరెస్టు చేశారు. భార్య ప్రగతి యాదవ్ (22), ఆమె ప్రేమికుడు అనురాగ్ యాదవ్, కిరాయి హంతకుడు అరెస్టు చేశారు.
ప్రగతి(Pragati), దిలీప్ (Dileep) మార్చి 5న వివాహం చేసుకున్నారు. దిలీప్ మార్చి 19న బుల్లెట్ గాయాలతో కనిపించాడు. ఆ తర్వాత చికిత్స కోసం బిధునాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే, అతని ఆరోగ్యం క్షీణించడంతో సైఫాయి ఆసుపత్రికి, తరువాత మధ్యప్రదేశ్(Madhya pradesh)లోని గ్వాలియర్‌కు తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. దిలీప్ మార్చి 21న మరణించాడు. దిలీప్ సోదరుడి ఫిర్యాదు మేరకు ఆ మహిళ, ఆమె ప్రేమికుడిని అరెస్టు చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈ సంబంధాన్ని వ్యతిరేకించిన కుటుంబం, దిలీప్‌ను వివాహం చేసుకోవాలని బలవంతం చేసింది.
వివాహం తర్వాత ప్రగతి, అనురాగ్ యాదవ్(Anurag Yadav) ప్రేమికులు కలవలేకపోయారు. దీంతో దిలీప్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ దిలీప్‌ను చంపడానికి రామాజీ చౌదరి(Ramaji Chowdhary)ని రూ. 2 లక్షలకు సుపారీ ఇస్తామని చెప్పి నియమించుకున్నారు. రామాజీ, సహాయకులు దిలీప్‌ను పొలాలకు తీసుకెళ్లి కొట్టి కాల్చి చంపారు. వారు వెంటనే అక్కడి నుండి పారిపోయారు. సీసీటీవీ(CCTV) ఫుటేజ్ సహాయంతో నిందితులను గుర్తించారు. వారి వద్ద నుండి తుపాకీ మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయగా భార్య నిర్వాకం బయటపడింది.
