ఇవాళ కనుమ(Kanuma) పండుగ. సంక్రాంతి(Sankranti) తర్వాత వచ్చే రోజును పశువులకు కృతజ్ఞతలు చెప్పడానికి కేటాయిస్తారు. కాబట్టే ఇది కనుమ పండుగ అయ్యింది. అసలు సంక్రాంతి పండుగే వ్యవసాయ ఆధారిత పండుగ. వ్యవసాయంలో తమకు సాయం చేసిన పశువులను రైతులు తమ కుటుంబసభ్యులుగానే భావిస్తారు. ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి ఏమైనా అయితే తల్లిడిల్లిపోతారు.

ఇవాళ కనుమ(Kanuma) పండుగ. సంక్రాంతి(Sankranti) తర్వాత వచ్చే రోజును పశువులకు కృతజ్ఞతలు చెప్పడానికి కేటాయిస్తారు. కాబట్టే ఇది కనుమ పండుగ అయ్యింది. అసలు సంక్రాంతి పండుగే వ్యవసాయ ఆధారిత పండుగ. వ్యవసాయంలో తమకు సాయం చేసిన పశువులను రైతులు తమ కుటుంబసభ్యులుగానే భావిస్తారు. ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి ఏమైనా అయితే తల్లిడిల్లిపోతారు. పల్లెల్లో ఈ పండుగ చాలా గొప్పగా జరుగుతుంటుంది. పశువుల పండుగైన కనుమ రోజున కొమ్ములకు రంగులద్దుతారు. కొందరు ఇత్తడి తొడుగులు తొడుగుతారు. మూపురాల మీద పట్టుబట్టలు వేస్తారు. కాళ్లకు గజ్జలు కడతారు. మెడలో పూలదండలు వేసి చక్కగా అలంకరిస్తారు. ఆ అలంకరణల తర్వాత వాటి సోయగం అద్భుతంగా ఉంటుంది. పంట చేతికందేందుకు దోహదపడిన వారిందరికీ కనుమ రోజున కొత్త బట్టలు కూడా పెడతారు. పశువులనే కాదు, పక్షులను(Birds) కూడా ప్రేమించే సంప్రదాయం మనది. అందుకే కొత్తగా ఇంటికి వచ్చిన ధాన్యపు కంకులను ఇంటి చూర్లకు వేలాడదీస్తారు. వాటి కోసం ఇంటి చుట్టూ చేరే చిన్నచిన్న పిట్టలు, అవి చేసే కిలకిలరావాలతో సందడిగా ఉంటుంది. ఇక కనుమ రోజున మాంసాహారం(Non Veg) తినడం ఆనవాయితీ. తినని వారు గారెలు వండుకుంటారు. ఈ రోజున ప్రయాణాలు(Travelling) పెట్టుకోరు. కనుమ రోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెళ్లిన పని పూర్తికాదంటారు. ఆటంకాలు ఎదురవుతాయని చెబుతారు. అందుకే కనుమ రోజున ఎవరూ ప్రయాణాలు చేయరు. అయితే దీని వెనుక అసలైన కారణం మరోటి ఉంది. సంక్రాంతి పండుగ రోజున బంధువులతో ప్రతీ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. సంక్రాంతి మరుసటి రోజే ఎవరింటికివారు వెళ్లిపోతే లోగిళ్లు బోసిపోతాయని కనుమ రోజు ప్రయాణం చేయకూడదని అంటారేమో! కనుమ రోజు కాకి కూడా కదలదన్న సామెత అందుకే పుట్టిందేమో!

Updated On 16 Jan 2024 12:35 AM GMT
Ehatv

Ehatv

Next Story