దేశంలో అత్యున్నత ప్రధాన, విధాన నిర్ణయాక మండలి పార్లమెంట్. లోక్‌సభ, రాజ్యసభ కలిసి పార్లమెంట్‌గా ఏర్పడింది. లోక్‌సభలో ఎలెక్టెడ్ రిప్రజెంటేటీవీస్ ఉంటారు.

దేశంలో అత్యున్నత ప్రధాన, విధాన నిర్ణయాక మండలి పార్లమెంట్. లోక్‌సభ, రాజ్యసభ కలిసి పార్లమెంట్‌గా ఏర్పడింది. లోక్‌సభలో ఎలెక్టెడ్ రిప్రజెంటేటీవీస్ ఉంటారు. ఎలక్టెడ్ రిప్రజెంటేటీవీస్ తమ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాసమస్యలపై, దేశంలో ఉన్న అంశాలపై మాట్లాడుతారు. పార్లమెంటరీ వ్యవస్థలో స్పీకర్ పదవి చాలా కీలకం. స్పీకర్ పదవిని అధికారపక్షం తీసుకుంటుంది. అయితే డిప్యూటీ స్పీకర్ కూడా చాలా కీలకంగా ఉంటారు. పార్లమెంట్ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు సంబంధించిన సభ్యుల్లో ఒకరిని ఎన్నుకుంటారు. విపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించాలని డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇస్తుంటారు. అటువంటి సాంప్రదాయానికి 17వ లోక్‌సభలో పూర్తిగా తిలోదకాలు ఇచ్చారు, 18వ లోక్‌సభలో అదే పరిస్థితి నెలకొని ఉంది. 2014లో ప్రధానిగా మోడీ మొదటిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు 2014లో అన్నాడీఎంకేకు సంబంధించిన తంబిదురైకు అవకాశం ఇచ్చారు. తంబిదురై ఎన్డీఏ పార్టీ కాదు కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చారు. కానీ 2019 నుంచి ఇది అమలులో లేదు.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
