నాలుగేళ్ల క్రితం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(pm modi)పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్‌(Congress) నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi). మోదీ ఇంటిపేరును ప్రస్తావించి అనవసరంగా ఇరుక్కున్నారు.

నాలుగేళ్ల క్రితం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(pm modi)పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్‌(Congress) నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi). మోదీ ఇంటిపేరును ప్రస్తావించి అనవసరంగా ఇరుక్కున్నారు. అప్పుడు రాహుల్‌పై నమోదైన పరువునష్టం కేసులో (Criminal Defamation Case) గుజరాత్‌ సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ఆ వెంటనే బెయిల్‌ కూడా మంజూరు చేసింది. తీర్పును సవాల్‌ చేస్తూ అప్పీల్ చేసుకోవడానికి నెల రోజుల గడువు కూడా ఇచ్చింది. ఇప్పుడు రాహుల్‌గాంధీ 30 రోజుల్లోపు తీర్పును సవాల్‌ చేస్తూ అభ్యర్థన పిటిషన్‌ దాఖలు చేయాలి. ఒకవేళ అప్పీల్‌ను కోర్టు తిరస్కరించినా, ఆదేశాల నిలుపుదలకు నిరాకరించినా రాహుల్‌ సుప్రీం కోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది. అయితే ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 8 (3) ప్రకారం పార్లమెంట్‌ సభ్యులెవరైనా ఏదైనా కేసులో హీనపక్షం రెండేళ్ల శిక్షపడితే అనర్హత వేటు పడుతుంది. ఉన్న పదవి పోతుంది. అంటే రాహుల్‌కు పదవీగండం ఉందన్న మాట. వాయనాడు లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన రాహుల్‌ అప్పీల్‌కు వెళ్లకపోతే మాత్రం పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ఆ పరిస్థితి తలెత్తకపోవచ్చునని, ఆప్పీల్‌ చేయడానికి రాహుల్‌ రెడీ అవుతున్నారని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.
2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు కర్ణాటక(Karnataka) కోలార్‌(Kolar) దగ్గర ఓ ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు. మోదీని విమర్శించే క్రమంలో నీరవ్‌ మోదీ(Nirav Modi), లలిత్‌ మోదీ(Lalit Modi) పేర్లను ప్రస్తావించారు. మోదీ ఇంటిపేరుతో ఉన్నవారంతా దొంగలేనన్నమాట అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ తప్పుపట్టారు. అంత మాటంటావా అంటూ సూరత్‌ కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌పై పరువు నష్టం దావా చేశారు. ఇన్నేళ్లపాటు వాదోపవాదాలు జరిగిన తర్వాత రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది సూరత్‌ కోర్టు. రాహుల్‌ విమర్శించింది నరేంద్రమోదీనే తప్ప ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీని కాదని, ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని రాహుల్‌ తరఫు న్యాయవాది వాదించారు కానీ చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ హెచ్‌హెచ్‌ వర్మ మాత్రం ఒప్పుకోలేదు. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైనవని, పూర్ణేశ్‌ పరువుకు భంగం కలిగించేవని భావిస్తూ తీర్పు చెప్పారు. తీర్పు వెలువడిన తర్వాత సత్యమే నా దేవుడు, అహింస దానికి పొందే సాధనం అంటూ ట్వీట్‌ చేశారు రాహుల్‌ గాంధీ.

Updated On 23 March 2023 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story