1947 ఆగస్టు 15న భారతదేశ తొలి ప్రధానమంత్రి(Prime Minister)పండిట్ జవహర్ లాల్ నెహ్రూ(pandit jawaharlal nehru) ఎర్రకోట(Red Fort)మీద జాతీయ జెండాను ఎగురవేశారు.
1947 ఆగస్టు 15న భారతదేశ తొలి ప్రధానమంత్రి(Prime Minister)పండిట్ జవహర్ లాల్ నెహ్రూ(pandit jawaharlal nehru) ఎర్రకోట(Red Fort)మీద జాతీయ జెండాను ఎగురవేశారు. జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత అది ఓ ఆనవాయితీగా మారింది. తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు కూడా ప్రతి ఆగస్టు 15కు ఎర్రకోట మీదే జాతీయ జెండాను ఎగురవేస్తూ వచ్చారు. జాతినుద్దేశించి ప్రసంగించేవారు. అయితే ఇదే కారణం కాదు. ఎర్రకోటకు ఎనలేని చరిత్ర ఉంది. ఎంతో ప్రాముఖ్యత ఉంది. 1857 వరకు ఎర్రకోట మొఘల్ చక్రవర్తులకు ప్రధాన నివాసంగా ఉండింది. సిపాయి తిరుగుబాటులో కూడా ఎర్రకోటకు ప్రాముఖ్యత ఉంది. ఆఖరి మొఘల్ చక్రవర్తి బహద్దూర్ షా జాఫర్(Bahadur Shah Zafar)తో కలిసి ఎర్రకోట కేంద్రంగా బ్రిటిష్ వారితో పోరాటాలు చేశారు. 1857, సెప్టెంబర్ లో బ్రిటిష్ సైన్యం ఎర్రకోటను ఆక్రమించింది. బహద్దూర్ షా జాఫర్‌ను బందీ చేసింది. ఆయన కొడుకులను తల నరికి చంపేసింది. అలా మొఘల్ పాలన అంతమైంది. దేశం బ్రిటిష్ గుప్పిట్లో చిక్కింది. చరిత్ర ప్రాధాన్యత కలిగిన ఎర్రకోటలో జెండా ఎగురవేడయం ద్వారా బ్రిటిష్ పాలన నుంచి మనం విముక్తలయ్యామని చాటి చెప్పడం, మనం స్వాతంత్య్రాన్ని తిరిగి పొందామని చెప్పడం అవుతుంది. ఎర్రకోట మన స్వాతంత్ర్య, సార్వభౌమాధికారాలకు శాశ్వతమైన స్ఫూర్తి చిహ్నం.. ఎర్రకోట భారతదేశ వారసత్వానికి ప్రతీక. అంతేకాకుండా సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. ఇక్కడ ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేయడం వల్ల మనకు లభించిన స్వేచ్ఛ, సార్వభౌమాధికారాన్ని మరోసారి నొక్కి చెప్పినట్లు కూడా అవుతుందని భావిస్తారు.