ప్రతి ఆర్థిక సంవత్సరం(Economic Year) ఏప్రిల్(April) 1వ తేదీన ప్రారంభమై మార్చి 31వ తేదీన ముగుస్తుంది. క్యాలెండర్ ఇయర్ ప్రకారం జనవరి 1వ తేదీన మొదలయ్యి డిసెంబర్ 31వ తేదీన ముగివచ్చు కదా! ఎందుకు ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచే మొదలవుతున్నది? ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకేనని ఎందుకు పరిగణిస్తారు? ఈ సందేహాలు చాలా మందికి కలుగుతాయి.
ప్రతి ఆర్థిక సంవత్సరం(Economic Year) ఏప్రిల్(April) 1వ తేదీన ప్రారంభమై మార్చి 31వ తేదీన ముగుస్తుంది. క్యాలెండర్ ఇయర్ ప్రకారం జనవరి 1వ తేదీన మొదలయ్యి డిసెంబర్ 31వ తేదీన ముగివచ్చు కదా! ఎందుకు ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచే మొదలవుతున్నది? ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకేనని ఎందుకు పరిగణిస్తారు? ఈ సందేహాలు చాలా మందికి కలుగుతాయి. దీనికి కచ్చితమైన కారణాలు తెలియదు కానీ ఆర్ధిక పరిశోధకులు చెప్పే రీజనింగ్ మాత్ర బాగుంది. బ్రిటన్‌లో(British) ఆర్దిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉంటుంది. బ్రిటిష్ పాలించిన దేశాలలో అకౌంటింగ్ వ్యవధి ఇలాగే ఉండింది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ పద్దతినే కొనసాగిస్తోంది. మనకు అక్టోబర్, నవంబర్ మాసాలలో పెద్ద పండుగులు వస్తాయి. దసరా నవరాత్రులు, దీపావళి పండుగలు ఈ మాసాల్లోనే వస్తాయి. డిసెంబర్‌లో క్రిస్మస్ పండుగ ఉంటుంది. పండుగల వేళ వ్యాపారుల అమ్మకాలు ఎక్కువగానే ఉంటాయి. అందుకే డిసెంబర్‌ను ఆర్ధిక సంవత్సరం ఆఖరి నెలగా పరిగణించరు. మార్చిలో పెద్దగా పండుగలు ఉండవు. హోలీని మినహాయిస్తే. మనకు ఉగాది సర్వ సాధారణంగా ఏప్రిల్ మాసంలోనే వస్తుంది. ఆ రోజు నుంచే మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది. అలాగే ఉత్తరభారతంలో చాలా మట్టుకు రాష్ట్రాలు తమ కొత్త సంవత్సరాన్ని ఏప్రిల్ 14 లేదా 15వ తేదీలలో జరుపుకుటారు. ఈ కారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించాలని ప్రభుత్వం భావించింది.