పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలోని(Puri jagannath Temple) రత్నభాండాగారాన్ని(ratna bhandagar) రెండు రోజుల కిందట తెరిచిన సంగతి తెలిసిందే

పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలోని(Puri jagannath Temple) రత్నభాండాగారాన్ని(ratna bhandagar) రెండు రోజుల కిందట తెరిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ రత్న భండాగారంలోని లోపలి గదిని డూప్లికేట్‌ తాళం(duplicate keys) చెవులతో తెరిచేందుకు ప్రయత్నించారు కానీ గది తలుపులు తెరచుకోలేదు. డూప్లికేట్‌ కీస్‌తో ఆ గది ఎందుకు తెరచుకోలేదో తెలుసుకోవడానికి ఒడిశా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టనుంది. 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారాన్ని తెరిచారు. అందులో ఉన్న విలువైన బంగారు, వెండి ఆభరణాలను లెక్కపెట్టబోతున్నారు లోపలి గదిలో ఉన్న మూడు తాళాలను ఓపెన్‌ చేయడానికి ప్రత్యేక కమిటీ ప్రయత్నించింది. అయితే పూరి జిల్లా అధికారి అరవింద పదే దగ్గర ఉన్న రెండు డూప్లికేట్‌ తాళం చెవిలతో ఆ ఖజానా తాళాలు ఓపెన్‌ కాలేదు. ఇంతకు ముందు బీజేడీ ప్రభుత్వం ఉన్నప్పుడు డూప్లికేట్ తాళం చెవిలు ఉన్న‌ట్లు అబద్ధాలను ప్ర‌చారం చేశారని న్యాయ‌శాఖ మంత్రి పృథ్వీరాజ్ హ‌రిచంద‌న్ అన్నారు. దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్నామని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వ న్యాయ‌శాఖ ప‌రిధిలో జ‌గ‌న్నాథ ఆల‌యం ఉన్న‌ది. 2018, ఏప్రిల్ 4వ తేదీన ర‌త్న భాండాగారాన్ని తెరిచేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది. కానీ తాళం చెవులు లేక‌పోవ‌డంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కానీ కొన్ని రోజుల‌కు డూప్లికేట్ తాళంచెవులు దొరికిన‌ట్లు చెప్పారు. ఒక‌వేళ ఎవ‌రైనా జ‌గ‌న్నాథుడి ఆభ‌ర‌ణాలు తాకినట్టు తెలిసినా వారిపై క‌ఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఆదివారం ర‌త్న భాండాగారం మూడు తాళాలు డూప్లికేట్ తాళంచెవుల‌తో తెరచుకోకపోవడంతో స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రోసీజ‌ర్ ప్ర‌కారం మెజిస్ట్రేట్ స‌మ‌క్షంలో లొప‌లి గ‌దికి చెందిన మూడు తాళాల‌ను ప‌గుల‌గొట్టారు.

Eha Tv

Eha Tv

Next Story