పట్టుమని 19 ఏళ్ల కూడా లేవు కానీ కందుల సాయి వర్షిత్‌ వేసుకున్న ప్రణాళికలు చూస్తే ఆశ్చర్యమూ భయమూ ఒకేసారి కలుగుతాయి. భారీ ట్రక్కుతో వైట్‌ హౌజ్ బారికేడ్లను ఢీ కొట్టిన సాయి వర్షిత్‌పై సీక్రెట్‌ సర్వీస్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో సంచలన విషయాలు తెలిశాయి. కొలంబియా జిల్లా కోర్టులో సీక్రెట్‌ సర్వీస్‌ ఈ క్రిమినల్‌ అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

పట్టుమని 19 ఏళ్ల కూడా లేవు కానీ కందుల సాయి వర్షిత్‌(Sai Varshith) వేసుకున్న ప్రణాళికలు చూస్తే ఆశ్చర్యమూ భయమూ ఒకేసారి కలుగుతాయి. భారీ ట్రక్కుతో వైట్‌ హౌజ్(White House) బారికేడ్లను ఢీ కొట్టిన సాయి వర్షిత్‌పై సీక్రెట్‌ సర్వీస్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో సంచలన విషయాలు తెలిశాయి. కొలంబియా జిల్లా కోర్టులో సీక్రెట్‌ సర్వీస్‌ ఈ క్రిమినల్‌ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. మనోడు ముందు వైట్‌ హౌజ్‌ను స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను చంపేసి దేశాన్ని పరిపాలించాలనుకున్నాడు. ఇలాంటి ఆలోచనలు అతడికి కలగడానికి కారణం హిట్లర్‌ను అభిమానించడమే! సాయివర్షిత్‌ సెయింట్‌ లూయిస్‌ నుంచి వన్‌వే టికెట్‌ కొనుక్కుని డుల్లిస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. ఎయిర్‌పోర్ట్‌ దగ్గరే యూ-హౌల్‌ ట్రక్కును కిరాయికి తీసుకున్నాడు. ఆ ట్రక్కు వేసుకుని నేరుగా వైట్‌హౌజ్‌కు వెళ్లాడు. రాత్రి 9.35 నిమిషాలకు బారికేడ్లను ఢీ కొట్టాడు. వైట్‌హౌజ్ ముందు ఉన్న ల‌ఫాయేతి స్క్వేర్ పార్క్‌లో ఆ ట్ర‌క్కుతో దూసుకెళ్లాడు. అక్క‌డ ఉన్న మెట‌ల్ సెక్యూర్టీ బారియ‌ర్ల‌ను ఢీకొట్టాడు. ఆ త‌ర్వాత ట్ర‌క్కును రివ‌ర్స్‌లోకి తీసుకుని మ‌ళ్లీ బారియ‌ర్ల‌కు డాష్‌ ఇచ్చాడు. ట్రక్కు నుంచి పొగ రావడంతో దాన్నుంచి వర్షిత్‌ కిందకు దిగాడు. ట్రక్కు వెనుక నుంచి నాజీల స్వస్తిక్‌ గుర్తు జెండాను తీసుకున్నాడు. అతడికి నాజీలంటే ప్రాణమట! వాళ్ల చరిత్ర గొప్పదట! నాజీల నియంతృత్వ ధోరణికి ఆకర్షితుడయ్యాడట! ప్రపంచమంతా ఒక ఆర్డర్‌లోకి రావాలంటే నాజీల నియంతృత్వధోరణినే సరైందని వర్షిత్‌ చెబుతున్నాడు. తాను హిట్లర్‌ను ఫాలో అవుతున్నానని, హిట్లర్‌ బలమైన నేత అని అంటున్నాడు. నాజీ జెండాను ఆన్‌లైన్‌లో కొన్నాడట. వైట్‌హౌజ్‌పై దాడి చేయడానికి ఆరు నెలల నుంచి ప్లాన్‌ వేస్తున్నానని చెప్పాడు వర్షిత్‌. చెస్టర్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్‌ నిరుడు మార్‌క్వీట్‌ సీనియర్‌ హై స్కూల్‌ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఇప్పటి వరకు సాయివర్షిత్‌పై ఎలాంటి పోలీసు రికార్డు లేదని చెస్టర్‌ఫీల్డ్‌ పోలీసులు చెప్పారు. ట్రక్కులో ఆయుధాలు కానీ, పేలుడు పదార్థాలు కానీ దొరకలేదని అన్నారు..

Updated On 24 May 2023 4:34 AM GMT
Ehatv

Ehatv

Next Story