అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) ముగిశాయి. పార్లమెంట్ ఎన్నికలు(Parliament Elections) తరుముకొస్తు్నాయి. దీంతో చేవెళ్ల ఎంపీ సీటు(Chevella MP seat) ఎవరిది అనే చర్చ మొదలైంది? ఎన్నికలకు ముందే చేవేళ్ల పార్లమెంట్ రాజకీయం చెమటలు పట్టిస్తోంది. ఈసారి చేవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ట్రయాంగిల్ ఫైట్(Triangle Fights) తప్పదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) ముగిశాయి. పార్లమెంట్ ఎన్నికలు(Parliament Elections) తరుముకొస్తు్నాయి. దీంతో చేవెళ్ల ఎంపీ సీటు(Chevella MP seat) ఎవరిది అనే చర్చ మొదలైంది? ఎన్నికలకు ముందే చేవేళ్ల పార్లమెంట్ రాజకీయం చెమటలు పట్టిస్తోంది. ఈసారి చేవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ట్రయాంగిల్ ఫైట్(Triangle Fights) తప్పదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చేవెళ్ల ఎంపీ పరిధిలో మెజార్టీ అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకున్న బీఆర్ఎస్(BRS)..మరోసారి తన ఖాతాలో వేసుకుంటుందా? మరోవైపు అధికార కాంగ్రెస్(Congress) వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? అధికార విపక్షాల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఓసారి చూద్దాం.

హైద‌రాబాద్ నగరానికి ఆనుకొని ఉండే లోక్‌సభ(Lok sabha) నియోజ‌క‌వ‌ర్గం చేవెళ్ల. ఒకవైపు పూర్తిగా గ్రామీణ వాతావరణం, మరోవైపు అత్యంత ఆధునిక జీవనం మిళితమైందే చేవెళ్ళ పార్లమెంటరీ సెగ్మెంట్. వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితులున్న ఈ ఎంపీ సీటుపై మూడు ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గులాబీ పార్టీ తరపున రంజిత్‌రెడ్డి(Ranjith Reddy) విజయం సాధించారు. ఇప్పటికే మూడుసార్లు జెండా ఎగరేసిన గులాబీ పార్టీ..మూడోసారి జోరు కొనసాగించాలని భావిస్తోంది. అయితే చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, నాలుగు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించాయి. గ్రేటర్ హైదరాబాద్ శివారులోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు కమలం పార్టీ గట్టిపోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ముక్కోణ పోరు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీచేస్తారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రకటించారు. నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధిష్టానం చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం కూడా నిర్వహించింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎలాగైనా చేవెళ్లలో పాగా వేయాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించుతారనేది ఆసక్తికరంగా మారింది. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితోపాటు(Lakshmareddy) గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు త్యాగం చేసిన మరికొందరి పేర్లు వినిపిస్తు్నాయి. ప్రస్తుతం చేవేళ్ల ఎంపీ ఎన్నికల ఇంఛార్జీగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి(Cm revanth Reddy) బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఛాలెంజ్ గా తీసుకుంటే బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ బరిలో దింపే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇక బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Visveshwar Reddy) పేరును అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఎంపీగా పనిచేయడంతో పాటు.. స్థానికంగా పట్టు ఉండటం.. అన్ని రాజకీయ పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉండటం.. మోదీ ఛరిష్మా కలిసి వస్తుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. అయితే
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ స్థానాల్లో మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. ఎంఐఎం పార్టీ ప్రత్యేకంగా అభ్యర్థిని నిలబెడుతుందా ? లేదంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో పరోక్షంగా ఎవరికైనా సపోర్ట్ చేస్తుందా ? అనేది తేలాల్సి ఉంది. ఎంఐఎం తీసుకునే నిర్ణయంపైనే పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉంటాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Updated On 14 Jan 2024 8:14 AM GMT
Ehatv

Ehatv

Next Story