దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా(Ratan Tata) మరణం దేశానికి తీరని లోటు!
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా(Ratan Tata) మరణం దేశానికి తీరని లోటు! నిండైన వ్యక్తితం కలిగిన ఆయన దేశం గర్వించదగిన మహోన్నతుడు. దేశాభివృద్ధిలో ఆయన ఎంతగానో తోడ్పడ్డారు. సంపద పెరగడానికి కారణమయ్యారు. సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ సామాన్యుడిలాగే పెరిగాడు. విలాసవంతమైన జీవితానికి బద్ద విరోధి. చనిపోయేంత వరకు నిరాడంబరంగా ఉన్నారు. సామాజిక సేవా(Social service) కార్యక్రమాలలో పాల్గన్నారు. దానగుణ శీలుడన్న పేరు తెచ్చుకున్నారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాలకోసం ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యం. ఆయన మరణం తర్వాత ఆ వ్యాపార సామ్రాజ్యానికి వారసులెవరు(Heir)? ఆయన సంపద ఎవరి సొంతం అవుతుంది? వీలునామాలో(Will) ఏం రాశారు? అన్న చర్చ జరుగుతోంది. రతన్‌టాటా పెళ్లి(Marriage) చేసుకోలేదన్న విషయం తెలిసిందే. మూడు నాలుగు ప్రేమలు విఫలమయ్యాయి. అమెరికాలో ఓ అమ్మాయిని రతన్‌టాటా గాఢంగా ప్రేమించారు. ఆమె కూడా రతన్‌ను ప్రేమించింది. అయితే ఇండో చైనా వార్ పెళ్లికి ప్రతిబంధకమయ్యింది. రతన్ టాటాకు పెళ్లి కాకపోవడంతో ఆయనకు సంతానం లేదు. దీంతో రతన్ టాటా ఆస్తిపాస్తులు(Assests) ఎవరికి దక్కుతాయనే క్యూరియాసిటీ పెరిగింది. , రతన్ వ్యాపార సామ్రాజ్యానికి ఆయన సోదరుడి పిల్లలు వారసులవరుతారని తెలుస్తోంది. రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సూని టాటా. 1940లో వీరు విడిపోయారు. ఆ తర్వాత నావల్ టాటా.. సిమోన్‌ను వివాహం చేసుకున్నారు. అతని కుమారుల్లో ఒకరి పేరు నోయెల్ టాటా. ఆయనకు ముగ్గురు పిల్లలు మయా టాటా, నెవిల్లే టాటా, లీ టాటా ఉన్నారు. వీరంటే రతన్ టాటాకు చాలా ఇష్టం. వారికి కూడా రతన్ టాటా అంటే ప్రేమ! ఆయనను బాగా చూసుకునేవారు. తన సంపదలో 30 శాతం వీరికి చెందేట్టుగా విల్లు రాశారు రతన్. మిగతా సొమ్ము సేవ చేసే ట్రస్టులకు చెందేలా రాశారట!