మహారాష్ట్రలో(Maharashtar) బీజేపీ(BJP) నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి(CM) ఎవరన్నది చర్చగా మారింది.
మహారాష్ట్రలో(Maharashtar) బీజేపీ(BJP) నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి(CM) ఎవరన్నది చర్చగా మారింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు కేంద్రహోం మంత్రి అమిత్ షా(Amit shah) ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడే చెప్పలేమని ప్రకటించారు. అంటే ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే(Eknath shinde) కొనసాగుతారా అన్నది అనుమానంగానే ఉంది. బీజేపీ సాధించిన అనూహ్య విజయం కారణంగా ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను(Devendra phadnavis) మళ్లీ ఆ పీఠంపై కూర్చునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఫడ్నవీస్ మాత్రం ముఖ్యమంత్రి ఎవరన్నది తమ కూటమిలోని మూడు పార్టీలు నిర్ణయిస్తాయని చెప్పారు. అయితే ఫడ్నవీస్‌కు ఆర్‌ఎస్‌ఎస్(RSS) ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇంకా 20 సీట్లు కావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కూటమి పార్టీలైన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు ముఖ్యమంత్రిని అడిగే పరిస్థితులలో అయితే లేవు. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకే సీఎం పదవి దక్కాలన్న ఫార్ములా ఏదీ లేదని ముఖ్యమంత్రి షిండే వ్యాఖ్యానించడం వెనుక తాను కూడా రేసులో ఉన్నానని చెప్పడమేమో!