ఎన్నికల సమయంలో తరుచుగా ఏ–ఫారం(A Form), బీ–ఫారం(B Form) పేర్లు వింటుంటాం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల(Political party) గుర్తులు అభ్యర్థులకు రావాలంటే వీటి అవసరం ఉంటుంది. అవి ఏమిటో? ఎలా ఇస్తారో తెలుసా? గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్ధులు వీరే అంటూ పార్టీ ప్రతినిధి ఇచ్చేది బీ-ఫారం.

ఎన్నికల సమయంలో తరుచుగా ఏ–ఫారం(A Form), బీ–ఫారం(B Form) పేర్లు వింటుంటాం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల(Political party) గుర్తులు అభ్యర్థులకు రావాలంటే వీటి అవసరం ఉంటుంది. అవి ఏమిటో? ఎలా ఇస్తారో తెలుసా? గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్ధులు వీరే అంటూ పార్టీ ప్రతినిధి ఇచ్చేది బీ-ఫారం. నామినేషన్‌(Nomination) సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన బీ ఫారాన్ని దాఖలు చేస్తేనే, ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును ఆ అభ్యర్థికి కేటాయిస్తారు. సాధారణంగా పార్టీ అధ్యక్షులు లేదా ప్రత్యేకంగా నియమించిన ప్రతినిధులు ఈ ఫారాన్ని ఇస్తారు. ఈ ఫారం తీసుకున్న అభ్యర్థులు.. నామినేషన్ వేసేందుకు అర్హత కలిగివుంటారు. వీరు ఈ ఫారంతోపాటూ.. నామినేషన్ పత్రాన్ని నింపేటప్పుడు అన్నీ నిజాలే రాయాల్సి ఉంటుంది. వీరు ఇచ్చే అఫిడవిట్‌లో పేర్లు, విద్యార్హత, చేస్తున్న వ్యాపారాలు, స్థిర-చర ఆస్తుల వివరాలు, అప్పులు ఇలా అన్ని వివరాలూ ఇవ్వాల్సి ఉంటుంది. పార్టీ తన అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేస్తుందో వారికి బీ–ఫారం అందజేస్తారు. బీ–ఫారం అందించే వ్యక్తికి ముందుగా ఇచ్చేది ఏ- ఫారం. ఎవరిని పార్టీ ఎంపిక చేసి ఏ–ఫారం అందిస్తుందో వారికి మాత్రమే బీ–ఫారం అందిస్తారు. ఏ–ఫారం అందుకున్న పార్టీ అభ్యర్థి ముందుగా తనకు లభించిన ఏ–ఫారంను ఎన్నికల అధికారులకు అందజేస్తారు...

Updated On 19 April 2024 3:45 AM GMT
Ehatv

Ehatv

Next Story