తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు కె. ఆర్మ్‌స్ట్రాంగ్ తన ఇంటి బయట దారుణంగా హత్యకు గురయ్యాడు.
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు కె. ఆర్మ్‌స్ట్రాంగ్ తన ఇంటి బయట దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మ్‌స్ట్రాంగ్ తన ఇంటి ముందు పార్టీ కార్యకర్తలతో ఉండగా.. రెండు బైక్‌లపైవచ్చిన ఆరుగురు వ్యక్తులు పదునైన ఆయుధాలతో ఆయనపై దాడి చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ ఘటనపై స్పందించారు. నిందితులను తమిళనాడు ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కె. ఆర్మ్‌స్ట్రాంగ్ తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్శిటీ నుండి న్యాయశాస్త్ర పట్టా తీసుకుని చెన్నై కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్ 2006లో మునిసిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో విజయం సాధించారు. అదే సంవత్సరంలో తమిళనాడు BSP చీఫ్‌గా నియమితులయ్యారు. 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, ఆర్మ్‌స్ట్రాంగ్ కొలత్తూరు స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్ దళితులు, అణగారిన వర్గాల హక్కులకై తన గొంతు వినిపించారు.