కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Assembly Elections ) చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో బీజేపీ(BJP) ఉంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించి తీరాలని భావిస్తున్న బీజేపీ అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Assembly Elections ) చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో బీజేపీ(BJP) ఉంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించి తీరాలని భావిస్తున్న బీజేపీ అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నది. సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నది. హిందుత్వను తెరపైకి తీసుకొస్తున్నది. ఇప్పటికే టిప్పు సుల్తాన్ చరిత్ర(Tipu Sultan History)ను ఎంతగా వక్రీకరించాలో అంతగా వక్రీకరించిన బీజేపీ ఇప్పుడు కొత్త వివాదానికి తెర తీసింది. టిప్పు సల్తాన్‌పై బీజేపీ జాతీయ కార్యదర్శి సి.టి.రవి(C. T. Ravi) ఓ వివాదాస్పన ప్రకటన చేసి రాజకీయాలను వేడెక్కించారు. ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ ఆయన తాను కనక టిప్పు సుల్తాన్ కాలంలో పుట్టి ఉంటే ఊరి గౌడ, నంజేగౌడల మాదిరిగా తిరుగుబాటు చేసేవాడినని అన్నారు. టిప్పు సుల్తాన్‌ను బ్రిటిష్, మరాఠా సైన్యం చంపలేదని, ఈ ఇద్దరు వొక్కలిగ నాయకులు ఊరిగౌడ, నంజేగౌడ చంపారని బీజేపీ ఇలా కొత్త వాదనకు తెర తీసింది. పాత మైసూర్ ప్రాంతంలోని కొన్ని వర్గాలు, బీజేపీ నాయకులు రవికి మద్దతుగా నిలిచారు. టిప్పు సుల్తాన్‌తో వొక్కలిగ పాలకులు ఊరి గౌడ, నంజే గౌడ యుద్ధం చేసి టిప్పును చంపేశారని వీరు ప్రచారం చేస్తున్నారు. నిజానికి టిప్పు మరణంపై ఎన్నోసార్లు చర్చ జరిగింది. గత ఏడాది టిప్పువిన నిజ కనసుగలు పేరుతో ఓ నాటకం వచ్చింది. అప్పుడే ఊరి గౌడ, నంజేగౌడ పేర్లు బయటకు వచ్చాయి. ఈ నాటకానికి రంగాయణ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ అడ్డండ కరియప్పా దర్శకత్వం వహించారు. బీజేపీ నేతల ప్రకటనను రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్‌లే కాదు, చరిత్రకారులు కూడా తప్పుపడుతున్నారు. అసలు ఊరిగౌడ, నంజేగౌడ అనే పాలకులు లేనే లేరని, ఇవి కేవలం కల్పిత పాత్రలు మాత్రమేనని అంటున్నారు. ఇదిలా ఉంటే కర్నాటక ఉద్యానవన శాఖ మంత్రి మునిరత్న ఈ నాటకం ఆధారంగా సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు. ఊరిగౌడ-నంజేగౌడ పేరిట సినిమా టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేశారు. ఈ వ్యవహారంపై శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థ మఠం పీఠాధిపతి నిర్మలానంద స్వామిజీ జోక్యం చేసుకున్నారు. ఆధారాలు లేకుండా ఎలాంటి సినిమా తీయవద్దని మంత్రి మునిరత్నకు విజ్ఞప్తి చేశారు.