Rudra karan Prathap : ఎవరీ రుద్రకరణ్ ప్రతాప్.. ఆయన చెప్పింది నిజమే అవుతుందా?
జ్యోతిష్యాన్ని(Astrology) నమ్మేవాళ్లున్నట్టుగానే, అంతా నాన్సెన్స్ అని కొట్టిపారేసేవారు ఉంటారు. జ్యోతిష్యం కంప్లీట్‌గా వ్యక్తిగతం! కానీ సోషల్ మీడియా(Social media) వచ్చిన తర్వాత ఇది పబ్లిక్ అయ్యింది. రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, సెలెబ్రిటీల మీద తమకు తోచిన జాతకాలు చెప్పడంతో ఈ శాస్త్రం పాపులరయ్యింది. ఫలానా వారు మళ్లీ అధికారంలోకి వస్తారని, ఫలానావారికి ఈ ఏడాది అసలు బాగోలేదని, ఫలానా వారు చనిపోతారని చెబుతూ పాపులరైన జ్యోతిష్యులను కూడా మనం చూశాం. జోస్యం గురించి చెబుతున్నప్పుడు అనివార్యంగా వేణుస్వామి(Venu swamy) గురించి చెప్పాల్సి వస్తోంది.
జ్యోతిష్యాన్ని(Astrology) నమ్మేవాళ్లున్నట్టుగానే, అంతా నాన్సెన్స్ అని కొట్టిపారేసేవారు ఉంటారు. జ్యోతిష్యం కంప్లీట్‌గా వ్యక్తిగతం! కానీ సోషల్ మీడియా(Social media) వచ్చిన తర్వాత ఇది పబ్లిక్ అయ్యింది. రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, సెలెబ్రిటీల మీద తమకు తోచిన జాతకాలు చెప్పడంతో ఈ శాస్త్రం పాపులరయ్యింది. ఫలానా వారు మళ్లీ అధికారంలోకి వస్తారని, ఫలానావారికి ఈ ఏడాది అసలు బాగోలేదని, ఫలానా వారు చనిపోతారని చెబుతూ పాపులరైన జ్యోతిష్యులను కూడా మనం చూశాం. జోస్యం గురించి చెబుతున్నప్పుడు అనివార్యంగా వేణుస్వామి(Venu swamy) గురించి చెప్పాల్సి వస్తోంది. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయన పాపులర్ కాబట్టి. పైగా సెలబ్రిటీ జ్యోతిష్కుడాయె! ఎంతగా అంటే హీరోయిన్లు ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకునేంతటగా! ఆయన వామాచార పద్ధతిలో గ్రహచార రిలీఫ్ పూజలు కూడా చేస్తుంటారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం కల్ల అని, కవితకు న్యాయపరమై చిక్కులు వస్తాయని తానెప్పుడో చెప్పానంటున్నారు వేణుస్వామి. పైగా బీఆర్‌ఎస్ గెలుస్తుందని తాను చెప్పి ఉంటే , ఆ వీడియో రుజువులు చూపండని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు వేణుస్వామిలాగే మరో జ్యోతిష్కుడు సోషల్ మీడియాలో పాపులరయ్యారు. ఆయన పేరు రుద్ర కరణ్ ప్రతాప్(Rudra Karan Prathap). ఈయన కూడా సెలబ్రిటీ జ్యోతిష్కుడే కానీ అయిదారు రోజుల నుంచి తెలుగువారికి సుపరచితులయ్యారు. ఈయన గొప్పలెక్కువగా చెప్పుకుంటుంటారు. సెల్ఫ్ ప్రమోషన్ అన్నమాట! రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇమ్రాన్ ఖాన్ పతనం, 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు, 2022 పంజాబ్ ఫలితాల గురించి తాను చెప్పినవి అక్షరాలా జరిగాయని ప్రచారం చేసుకుంటుంటారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా తనను ఎక్స్‌లో ఫాలో అవుతారని, బాలీవుడ్‌లో నటీనటులు, గాయనీగాయకులు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ తనతో జాతకం చెప్పించుకుంటారని క్లయిమ్ చేసుకుంటారు! కేజ్రీవాల్ పతనం 2025 ఓటమితో మరింత స్పష్టంగా కనిపిస్తుందని, 2024 మార్చిలో ఆయన లీగల్‌గా చిక్కుల్లో పడతారని తాను 2022లోనే ట్వీట్ చేశానని చెబుతూ ఆ ట్వీట్‌ను పోస్ట్ చేశారు రుద్రకరణ్ ప్రతాప్. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) మళ్లీ గెలుస్తారని రుద్రకరణ్ చెప్పారు. కేజ్రీవాల్ జోస్యం నిజమైనట్టుగానే, జగన్ గెలుస్తారని చెప్పింది కూడా వాస్తవరూపం దాలుస్తుందంటూ వైసీపీ క్యాడర్ సంబరపడుతున్నది. సరే, రుద్రకరణ్ ప్రతాప్ చెప్పినవన్ని నిజమే అవుతాయని అనుకోడానికి లేదు. ఈయనే లాస్టియర్ మే 29వ తేదీన ఓ ట్వీట్ చేశారు. అందులో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పారు. కానీ ఫలితం మరో రకంగా వచ్చింది. ఆ లెక్కన చూస్తే రుద్రకరణ్ ప్రతాప్ కంటే వేణుస్వామినే బెటర్. ఆయన కేసీఆర్ మళ్లీ సీఎం కాబోడని స్పష్టంగా చెప్పారు. మొత్తం మీద నాలుగైదు రోజుల నుంచి సోషల్ మీడియాలో రుద్రకరణ్ ప్రతాప్, వేణుస్వామిలు తెగ వైరల్ అవుతున్నారు.