మొన్నటి వరకు ప్రపంచాన్ని వణికించి, దేశాల ఆర్ధిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కరోనా వైరస్‌(Corona) సద్దుమణిగింది. ఆ ఉపశమనం నుంచి తేరుకోకముందే అంతుచిక్కని బ్యాక్టీరియల్‌ న్యుమోనియా(Bacterial pneumonia) భయపెడుతోంది. ఇటీవల చైనాలో చిన్న పిల్లల్లో(children) న్యుమోనియా కేసులు బయటపడి భయాందోళనలు రేపాయి.

మొన్నటి వరకు ప్రపంచాన్ని వణికించి, దేశాల ఆర్ధిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కరోనా వైరస్‌(Corona) సద్దుమణిగింది. ఆ ఉపశమనం నుంచి తేరుకోకముందే అంతుచిక్కని బ్యాక్టీరియల్‌ న్యుమోనియా(Bacterial pneumonia) భయపెడుతోంది. ఇటీవల చైనాలో చిన్న పిల్లల్లో(children) న్యుమోనియా కేసులు బయటపడి భయాందోళనలు రేపాయి. సరిగ్గా ఇలాంటి కేసులే అమెరికా మసూచుసెట్స్‌ ఒహియోలోని కొన్ని ప్రాంతాలలో పెరుగుతుండటం కలవరం కలిగిస్తున్నది. వైట్‌ లండ్‌ సిండ్రోమ్‌గా(White Lund Syndrome) సైంటిస్టులు పిలుస్తున్న ఈ శ్వాసకోశ వ్యాధి చిన్నారుల్లోనే ఎక్కువగా వ్యాపిస్తోంది. మూడు నుంచి ఎనిమిదేళ్ల వయసున్న పిల్లలో ఈ న్యుమోనియా వ్యాపిస్తోంది. ఈ ఇన్‌ఫెక్షన్‌లకు మైకోప్లాస్మా బ్యాక్టీరియానే(Microplasma Bacteria) కారణమని నిపుణులు భావిస్తున్నారు. శ్వాస ఆడకపోవడం, దగ్గు(Cough), ఛాతీ నొప్పి(Chest Pain), జ్వరం(Fever) , అలసట ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధి బాక్టీరియా, వైరల్ , పర్యావరణ కారకాల కలయిక వల్ల వస్తోందని అనుకుంటున్నారు. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, ఆక్సిజన్ థెరపీ, మెకానికల్ వెంటిలేషన్, కార్టికో స్టెరాయిడ్స్ ద్వారా వ్యాధిని నిరోధించవచ్చు. చైనాలో శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి ఆందోళన నేపథ్యంలో చైనా పొరుగు దేశాలైన తైవాన్, నేపాల్ , అధికారులు అప్రమత్తమయ్యారు. అమెరికాకు ముందు నెదర్లాండ్స్‌, డెన్మార్క్‌ వంటి దేశాలలో కూడా న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు మైకోప్లాస్మా కారణంగా భావిస్తున్నారు.ప్రతి లక్షమంది పిల్లలలో 80 మంది న్యుమోనియా సోకింది. న్యుమోనియా కేసులు 'అంటువ్యాధి' స్థాయికి చేరుకున్నాయని డెన్మార్క్‌కు చెందిన ఆరోగ్య ముఖ్యులు అంటున్నారు.

Updated On 2 Dec 2023 6:01 AM GMT
Ehatv

Ehatv

Next Story