సూర్య గమనాన్ని బట్టి మన పూర్వీకులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు.
సూర్య గమనాన్ని బట్టి మన పూర్వీకులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని(Utharayanam), దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని(dakshinayana) పేర్కొన్నారు. ఈ ఏడాది ఈరోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం కానున్న నేపథ్యంలో దక్షిణాయనం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం!
ఆర్యభట్ట(Aryabhatta) రచించిన ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. అయనం అంటే ప్రయాణం అని అర్థం. ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం ఉంటే మరో ఆరు నెలలు దక్షిణాయనం ఉంటుంది. సూర్యుడు(sun) మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ రోజు కర్కాటక సంక్రమణం ఉదయం 11:16 నిమిషాలకు మొదలవుతుంది.
ఈ రోజున ఈ సమయం నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. అయితే సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి ఆరు గంటల 49 నిమిషాలకు పుణ్యకాలంగా, రెండు గంటల 16 నిమిషాలు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రాల్లో చెప్పారు. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా దక్షిణాయనం పితృదేవతారాధనకు ఎంతో శ్రేష్టం. ఈ కాలంలో వచ్చే మహాలయ పక్షాలు పితృ తర్పణాలు, శ్రాద్ధాలకు విశేషమైనది. పితృదేవతలను శ్రాద్ధ తర్పణలతో సంతృప్తిపరిస్తే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రాద్ధాదులు సక్రమంగా నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. బతికుండగా తల్లిదండ్రుల సేవ, మరణించాక శ్రాద్ధాలు చేయడం ఎంతో ముఖ్యం. ఇది శుభప్రదం కూడా! పితృ రుణం తీర్చుకోవడానికి అది ఒక్కటే మార్గం....సూర్య గమనాన్ని బట్టి మన పూర్వీకులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని(Utharayanam), దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని(dakshinayana) పేర్కొన్నారు. ఈ ఏడాది ఈరోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం కానున్న నేపథ్యంలో దక్షిణాయనం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం!
ఆర్యభట్ట(Aryabhatta) రచించిన ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. అయనం అంటే ప్రయాణం అని అర్థం. ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం ఉంటే మరో ఆరు నెలలు దక్షిణాయనం ఉంటుంది. సూర్యుడు(sun) మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ రోజు కర్కాటక సంక్రమణం ఉదయం 11:16 నిమిషాలకు మొదలవుతుంది.
ఈ రోజున ఈ సమయం నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. అయితే సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి ఆరు గంటల 49 నిమిషాలకు పుణ్యకాలంగా, రెండు గంటల 16 నిమిషాలు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రాల్లో చెప్పారు. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా దక్షిణాయనం పితృదేవతారాధనకు ఎంతో శ్రేష్టం. ఈ కాలంలో వచ్చే మహాలయ పక్షాలు పితృ తర్పణాలు, శ్రాద్ధాలకు విశేషమైనది. పితృదేవతలను శ్రాద్ధ తర్పణలతో సంతృప్తిపరిస్తే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రాద్ధాదులు సక్రమంగా నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. బతికుండగా తల్లిదండ్రుల సేవ, మరణించాక శ్రాద్ధాలు చేయడం ఎంతో ముఖ్యం. ఇది శుభప్రదం కూడా! పితృ రుణం తీర్చుకోవడానికి అది ఒక్కటే మార్గం....