ప్రపంచంలోనే సంతోషంగా లేని దేశాలపై(Unhappy Countries) ఓ సంస్థ తన నివేదికను వెల్లడించింది. 137 దేశాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రధానంగా 6 అంశాలను దృష్టిలో ఉంచుకొని సర్వే నిర్వహించారు. సామాజిక భద్రత, ఆరోగ్యం, ఆదాయం, స్వేచ్ఛ, ప్రజలలో దాతృత్వ భావన, అవినీతి లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. మనిషి సంతోషంగా ఉండాలంటే ఇవన్నీ అవసరం. ఈ అంశాలను అందుకోలేని దేశాలను ప్రకటించారు.

ప్రపంచంలోనే సంతోషంగా లేని దేశాలపై(Unhappy Countries) ఓ సంస్థ తన నివేదికను వెల్లడించింది. 137 దేశాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రధానంగా 6 అంశాలను దృష్టిలో ఉంచుకొని సర్వే నిర్వహించారు. సామాజిక భద్రత, ఆరోగ్యం, ఆదాయం, స్వేచ్ఛ, ప్రజలలో దాతృత్వ భావన, అవినీతి లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. మనిషి సంతోషంగా ఉండాలంటే ఇవన్నీ అవసరం. ఈ అంశాలను అందుకోలేని దేశాలను ప్రకటించారు.

తొలి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్

137 దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత అసంతృప్తికరమైన దేశం. తాలిబాన్ పాలనలో, ఆఫ్ఘనిస్తాన్ చాలా తక్కు ఆదాయం, పేదరికం, ఆకలితో పోరాడుతోంది. దశాబ్దాలుగా రణరంగంగా మారిన ఆఫ్ఘనిస్థాన్‌లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తాలిబన్ల క్రూరమైన పాలనతో ప్రజలు నిరాశా నిస్పృహలతో కూడిన జీవితాన్ని గడపాల్సి వస్తోంది.

లెబనాన్

అత్యంత సంతోషించని దేశాల జాబితాలో లెబనాన్ రెండో స్థానంలో ఉంది. ఈ దేశం సామాజిక-రాజకీయ గందరగోళాన్ని, ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటోంది. ఇక్కడ ప్రజలు సమాజం, ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు.

సియర్రా లియోన్

సియెర్రా లియోన్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. కాగా అత్యంత సంతోషించని దేశాల జాబితాలో ఆఫ్రికాలో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉందని, రాజకీయ అస్థిరత కారణంగా ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్నారు. సామాజిక అశాంతితో సతమతమవుతున్న ఈ దేశ పౌరులు తమ ఆహార అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు.

జింబాబ్వే

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో జింబాబ్వే నాలుగో స్థానంలో ఉంది. జింబాబ్వే కూడా ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది, దాని కారణంగా అక్కడి ప్రజలలో నిరాశ, నిస్పృహలు ఏర్పడ్డాయి.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో

చాలా కాలంగా సంఘర్షణలు, రాజకీయ గందరగోళం, నియంతృత్వ పాలన, ప్రజల బలవంతపు వలసలను ఎదుర్కొంటున్న కాంగో అత్యంత అసంతృప్తికరమైన దేశాల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. అన్ని వైపుల నుంచి సవాళ్లతో చుట్టుముట్టబడిన కాంగో ప్రజలు దేశంలోని పరిస్థితిపై అసంతృప్తి, నిరాశతో ఉన్నారు.

బోట్స్వానా

బోట్స్వానాలో రాజకీయ-సామాజిక స్థిరత్వం కూడా లేకపోవడం వల్ల ప్రజలు సంతృప్తి చెందడం లేదు. ఈ దేశం అత్యంత అసంతృప్తికరమైన దేశాల జాబితాలో ఆరో స్థానంలో ఉంది.

మలావి

పెరుగుతున్న జనాభా, బంజరు భూములు, నీటిపారుదల సౌకర్యాల లేమి వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న మలావి సంతోషించని దేశాల జాబితాలో ఏడో స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజలకు ఆహార పదార్థాల కొరత, ఆర్థిక వ్యవస్థ చాలా అధ్వాన్నంగా ఉంది. పరిమిత వనరుల మధ్య పెరుగుతున్న జనాభా కారణంగా మలావి ప్రజలలో నిరాశ నెలకొంది.

కొమొరోస్

కొమొరోస్ చాలా అస్థిరంగా ఉంది, దీనిని 'కప్ కంట్రీ' అని పిలుస్తారు. సామాజిక-రాజకీయ అస్థిరత కారణంగా ఇక్కడి ప్రజలు తీవ్ర నిస్పృహలో ఉన్నారు. ఇది 8వ అత్యంత అసంతృప్తికరమైన దేశం.

టాంజానియా

ఆర్థిక, సామాజిక, రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న టాంజానియా అత్యంత అసంతృప్తి దేశాల జాబితాలో 9వ స్థానంలో ఉంది.

భారత్ ర్యాంకింగ్ ఎంత?

137 దేశాల జాబితాలో భారతదేశం దిగువ నుంచి 12 వ స్థానంలో ఉంది. అంటే ఇది ప్రపంచంలో 12 వ అత్యంత సంతోషంగా ఉన్న దేశంగా ఉంది. గ్లోబల్ స్టేజ్‌లో భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Updated On 12 March 2024 1:57 AM GMT
Ehatv

Ehatv

Next Story