సాధారణంగా మనిషి మరణాలను ఎవరూ అంచనా వేయలేరు. ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇది సాధ్యం కాదు. కానీ మనుషుల మరణాలపై చాలా కాలంగా పారానార్మలిస్టులు పరిశోధనలు జరిపారు. వీరి పరోధధన ప్రకారం మరణాన్ని ముందే చెప్పగల అనేక జంతువులు ఉన్నాయి. మరణాలను అంచనా వేసే జంతువులు ఐదు రకాలుగా ఉన్నాయని వీరు చెప్తున్నారు.

కుక్కలు(Dogs) : కుక్కలు మరణాన్ని ముందుగానే గుర్తిస్తాయంటున్నారు. మరణం సమీపిస్తుందని వాటికి తెలిసినప్పుడు.. కుక్కలు ఏడుస్తాయని అంటున్నారు. అందుకే ఎవరి ఇంటి ఎదుటనైనా కుక్క ఏడిస్తే మంచిది కాదని మన పెద్దలు అంటుంటారు.
పిల్లులు(Cats) : ఇవి కూడా ముందే మనుషుల మరణాన్ని పసిగట్టగలవని నమ్మకం. పురాతన కాలం నుంచి పిల్లులు మరణాన్ని ముందే గ్రహించగలవని మనకు చెప్తుంటారు. రెండు పిల్లులు కొట్లాడుకోవడం మంచిది కాదు.. మరణాన్ని అంచనా వేసే ఈ పనిచేస్తాయంటున్నారు.
నల్ల సీతాకోకచిలుక(Black Butterfly) : ఇది మరణ దూతగా ఉంటుందని చెపుతున్నారు. నల్ల సీతాకోకచిలుక నిజానికి సీతాకోకచిలుక కాదు, ఇది చిమ్మట రకం. నల్ల చిమ్మట రకం రాత్రి పూట ఎగరడం మంచిది కాదంటున్నారు.
నక్క(Fox) : పగటిపూట నక్క ఎవరి ఇంట్లోకైనా ప్రవేశిస్తే.. ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతారని నమ్ముతారు. నక్కలు సాధారణంగా పగటిపూట కనిపించవు, నక్కలు మానవ నివాసాలకు చాలా దూరంగా ఉంటాయి. అందువల్ల, పగటిపూట నక్క ఇంట్లోకి ప్రవేశించడం అంటే మరణం సంభవించినట్లేనంటున్నారు.
గబ్బిలాలు(Bats) : మరణ వార్తలను మోసుకొస్తాయని బలంగా నమ్ముతారు. దక్షిణ అమెరికాలోని మాయ, అజ్టెక్ నాగరికతలలో ఈ గబ్బిలాలు మరణం దూతలుగా పరిగణిస్తారని చెప్తున్నారు.