55 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించి వారం దాటింది. రెండో జాబితాపై కసరత్తు ముమ్మరం చేస్తోంది కాంగ్రెస్(Congress). అయితే రెండో జాబితా ప్రకటిస్తే అసంతృప్తులు భారీగా పెరిగే అవకాశం ఉందని, అందుకే రెండో లిస్ట్ ఆలస్యమవుతుందనే వార్తలు వస్తున్నాయి. తొలి జాబితా విడుదల తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కావాలనే జాప్యం చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. తొలి జాబితాలో ఇతర పార్టీల నుంచి వచ్చిన పారాచ్యూట్‌ నేతలకు అధిక ప్రాధాన్యతనిచ్చారన్న విమర్శలు వచ్చాయి.

రెండో జాబితా ఇస్తే అసంతృప్తులు మరింత పెరుగుతారా..?
రెబల్స్‌ భయమే సెకండ్ లిస్ట్ లేటవ్వడానికి కారణమా..?

55 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించి వారం దాటింది. రెండో జాబితాపై కసరత్తు ముమ్మరం చేస్తోంది కాంగ్రెస్(Congress). అయితే రెండో జాబితా ప్రకటిస్తే అసంతృప్తులు భారీగా పెరిగే అవకాశం ఉందని, అందుకే రెండో లిస్ట్ ఆలస్యమవుతుందనే వార్తలు వస్తున్నాయి. తొలి జాబితా విడుదల తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కావాలనే జాప్యం చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. తొలి జాబితాలో ఇతర పార్టీల నుంచి వచ్చిన పారాచ్యూట్‌ నేతలకు అధిక ప్రాధాన్యతనిచ్చారన్న విమర్శలు వచ్చాయి. శనివారం పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) నివాసంలో రెండో జాబితాపై సుదీర్ఘ కసరత్తు జరిగినప్పటికీ లిస్ట్‌ ఫైనల్‌ కాలేదని సమాచారం. అది కేవలం హోంవర్క్ మాత్రమేనని, అవసరమైతే స్క్రీనింగ్ కమిటీ సమావేశమవుతుందని లేదంటే నేరుగా కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి జాబితా పంపిస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. పండగ తర్వాతే రెండో జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే రెండో జాబితాలో మొత్తం అభ్యర్థులను ప్రకటిస్తారో లేదో కూడా తెలియదు. మూడు, నాలుగో జాబితా కూడా ఉండొచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి.

మరోవైపు తొలి విడతలో తమకు 12 మందికి స్థానాలు మాత్రమే కేటాయించిందని బీసీ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఆ 12 సిట్లలోనూ కాంగ్రెస్‌ గెలవలేని చంద్రాయణ్‌గుట్ట, యాకత్‌పురాలాంటి స్థానాల్లో బీసీలకు సీట్లు ఎలా ఇస్తారని నేతలు వాపోతున్నారు. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ ప్రకారం తమకు 34 టికెట్లు ఇవ్వాల్సిందేనని బీసీ నేతలు పట్టుబడుతున్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీ కూడా మారుతున్నారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఉద్యమకారుడు చెరుకు సుధాకర్‌లాంటి నేతలు బీసీలను కాంగ్రెస్‌ చిన్న చూపు చూస్తోందని బాహాటంగానే విమర్శించి బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెల్సిందే.

Updated On 22 Oct 2023 4:30 AM GMT
Ehatv

Ehatv

Next Story