BJP-TDP-Janasena : పొత్తుపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది?
బీజేపీతో(BJP) పొత్తు కోసం టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమి అధినేతలిద్దరూ ఢిల్లీకి(Delhi) వెళ్లారు. కేంద్రహోం మంత్రి అమిత్ షాకు(Amit Shah) పుష్పగుచ్ఛాలిస్తూ వేర్వేరుగా చంద్రబాబు(Chandrababu), పవన్‌కల్యాణ్‌లో(Pawan kalyan) ఫోటోలు దిగి మీడియాకు కూడా పంపారు. పొత్తు పొడిచిందహో అంటూ మీడియాకు లీకులు ఇచ్చారు. మీడియా కూడా బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు ఖరారయ్యిందంటూ ఊదరగొట్టేస్తోంది.
బీజేపీతో(BJP) పొత్తు కోసం టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమి అధినేతలిద్దరూ ఢిల్లీకి(Delhi) వెళ్లారు. కేంద్రహోం మంత్రి అమిత్ షాకు(Amit Shah) పుష్పగుచ్ఛాలిస్తూ వేర్వేరుగా చంద్రబాబు(Chandrababu), పవన్‌కల్యాణ్‌లో(Pawan kalyan) ఫోటోలు దిగి మీడియాకు కూడా పంపారు. పొత్తు పొడిచిందహో అంటూ మీడియాకు లీకులు ఇచ్చారు. మీడియా కూడా బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు ఖరారయ్యిందంటూ ఊదరగొట్టేస్తోంది. ఇక్కడి వరకు ఓకేనే! నిజంగానే సీట్ల సర్దుబాటు జరిగి ఉంటే అధికార ప్రకటన ఎందుకు రాలేదు? ఈ పాటికి చంద్రబాబు మైకుల ముందుకు వచ్చే వారు కదా? ఎందుకు రాలేదు? ఇక్కడే కొన్ని అనుమానాలు వస్తున్నాయి. బీజేపీతో ఆల్‌రెడీ జనసేన కలిసే ఉంది. అయినప్పటికీ బీజేపీతో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ టీడీపీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. ఇప్పుడేమో బీజేపీతో స్నేహం కోసం చంద్రబాబు, పవన్‌లు ఢిల్లీ వెళ్లారు. తమపై కాసింత దయ చూపమని బీజేపీ అధినాయకత్వాన్ని వేడుకుంటున్నారు. పొత్తు అయితే కుదిరిందని టీడీపీ నేత కనకమేడల చెబుతున్నారు కానీ టీడీపీ పెద్దలు మాత్రం ఇంకా రియాక్టవ్వలేదు. బీజేపీ నుంచి కూడా ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. బీజేపీ-జనసేనకు కలిసి 30 అసెంబ్లీ, ఎనిమిది లోక్‌సభ స్థానాలను టీడీపీ ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీకి ఆరు అసెంబ్లీ, అయిదు పార్లమెంట్ స్థానాలను ఇచ్చినట్టు అర్థం చేసుకోవాలి. గత ఎన్నికల్లో పోటీ చేసినన్ని సీట్లైనా లేకపోతే ఎలా? చంద్రబాబును అమిత్ షా ప్రశ్నించారట! టీడీపీ అనుకూల మీడియానేమో చంద్రబాబు అనుకున్నట్టుగానే బీజేపీని తక్కువ సీట్లకు కట్టడి చేశారంటూ చెబుతున్నాయి.