అయోధ్య(Ayodhya)లో నూతనంగా నిర్మితమైన రామాలయం(Ram Mandir)లో బాలరాముడు కొలువుదీరాడు. నిన్న ప్రాణప్రతిష్ట వైభవోపేతంగా జరిగింది. నిన్న బాలరాముడు కేవలం వీవీఐపీలకు మాత్రమే దర్శనమిచ్చాడు. ఇవాళ్టి నుంచి సామాన్యభక్తులకు రాముడు దర్శనమిస్తున్నాడు.
అయోధ్య(Ayodhya)లో నూతనంగా నిర్మితమైన రామాలయం(Ram Mandir)లో బాలరాముడు కొలువుదీరాడు. నిన్న ప్రాణప్రతిష్ట వైభవోపేతంగా జరిగింది. నిన్న బాలరాముడు కేవలం వీవీఐపీలకు మాత్రమే దర్శనమిచ్చాడు. ఇవాళ్టి నుంచి సామాన్యభక్తులకు రాముడు దర్శనమిస్తున్నాడు. మంగళవారం ఉదయం మూడు గంటల నుంచే రామాలయ ప్రధాన ద్వారం దగ్గర భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. సామాన్యభక్తులు శ్రీరాముడి నూతన విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే భక్తులను మందిరంలోకి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాన్ని పొడిగించే అవకాశం ఉంది. రామ్ లల్లా దర్శనం కోసం రెండు స్లాట్‌లు కేటాయిస్తున్నట్లు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఉదయం ఏడు గంటల నుంచి 11.30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు. ప్రతీరోజూ మధ్యాహ్నం బాలరామునికి బోగ్ అందించనున్నారు. అలాగే ప్రతి గంటకు పాలు, పండ్లు అందిస్తారు. రామ్‌లల్లాకు సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు దుస్తులను ధరింపజేస్తారు. ప్రత్యేక రోజుల్లో రాములోరికి పసుపు రంగు దుస్తులు ధరింపజేస్తారు. బాలరాముడికి రోజుకు ఆరుసార్లు హారతి ఇస్తారు. దీనికి హాజరయ్యేందుకు భక్తులకు పాస్‌లు జారీ చేస్తారు.