భారత(India) దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శ్రీనగర్‌ను(Srinagar) ఆక్రమించుకునేందుకు పాక్(Pakistan) కుట్రలు పన్నింది. ఇది గమనించిన కశ్మీర్ రాజు హరిసింగ్(Hari singh) భారత ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకొని.. తన సంస్థానాన్ని విలీనం చేశాడు. 1948 అక్టోబర్ 27న ఈ వీలిన ప్రక్రియ జరిగింది. 1949లో ఆ రాష్ట్ర ప్రధానిగా షేక్ అబ్దుల్లా, రాజ ప్రతినిధిగా హరిసింగ్ కుమార్ కరణ్‌సింగ్‌ను(Karan Singh) ప్రభుత్వం నియమించింది.
భారత(India) దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శ్రీనగర్‌ను(Srinagar) ఆక్రమించుకునేందుకు పాక్(Pakistan) కుట్రలు పన్నింది. ఇది గమనించిన కశ్మీర్ రాజు హరిసింగ్(Hari singh) భారత ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకొని.. తన సంస్థానాన్ని విలీనం చేశాడు. 1948 అక్టోబర్ 27న ఈ వీలిన ప్రక్రియ జరిగింది. 1949లో ఆ రాష్ట్ర ప్రధానిగా షేక్ అబ్దుల్లా, రాజ ప్రతినిధిగా హరిసింగ్ కుమార్ కరణ్‌సింగ్‌ను(Karan Singh) ప్రభుత్వం నియమించింది. 1948 అక్టోబర్ 17న కశ్మీర్‌కు(Kashmir) తాత్కాలిక ప్రాతిపదికన దీనికి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ 370 ఆర్టికల్‌ను(Article 370) చేర్చడంతో 1956 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. జమ్ముకశ్మీర్‌లో ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక అధికారాలు, రాజ్యాంగం, జెండా అమల్లో ఉండేది. రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలపై మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి అక్కడ అధికారాలు ఉండేవి. మిగతా రంగాల్లో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదు. అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అన్న నిబంధనలు ఉండేవి. విదేశీ ఆక్రమణలు, యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడే అక్కడ ఎమర్జెన్సీ(Emrgency) విధించాలన్న రూల్స్ ఉన్నాయి. రాజ్యాంగంలోని 21వ భాగంలో ఈ ఆర్టికల్ 370 చేర్చబడింది. ఈ క్రమంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం(Modi Goverment) ఏర్పడిన తర్వాత దేశమంతా ఒకే రాజ్యాంగం అమలులో ఉండాలన్న వాదనలు బలంగా వినిపించాయి. ఈ వాదనలతో కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది.
ఆగస్ట్ 5, 2019న రాజ్యాంగంలోని 370 కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేకంగా ఇచ్చిన అధికారాలను రద్దు చేయడమే కాకుండా.. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను కూడా రద్దు చేసింది. జమ్ముకశ్మీర్, లడఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించింది. ఢిల్లీలో ఉండే అసెంబ్లీలా కశ్మీర్‌కు అసెంబ్లీ ఉంచుతూ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. అసెంబ్లీ లేకుండా లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేస్తూ పార్లమెంట్‌లో బిల్లు పాస్ చేయించింది కేంద్రం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 2023 ఆగస్ట్ 2న 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. డిసెంబర్ 11న తీర్పునిచ్చింది. ఈ అంశంపై కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. పార్లమెంట్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టతనిచ్చింది.