ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi adityanath) ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi adityanath) ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన స్ట్రైక్ రేట్(Strike rate) ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో(Maharashtar assembly elections) ఆయన మహాయుతి కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(BJP) 132 స్థానాలను గెల్చుకుని ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. ముఖ్యమంత్రి పదవి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌కు(Devendra phadnavis) లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ విజయంలో యోగి ఆదిత్యనాథ్ పాత్ర ఎంతో ఉంది. ఆయన 18 మంది బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. ఇందులో 17 మంది విజయం సాధించారు. అకోలా వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి విజయ్ అగర్వాల్ మాత్రమే ఓడిపోయారు. ఈయన కూడా కేవలం వెయ్యి ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సాజిద్ ఖాన్(Saajid khan) చేతిలో ఓడిపోయారు. అలాగే మహాయుతి కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన అయిదుగురు అభ్యర్థల కోసం కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేశారు. మొత్తంగా ఆయన 23 మంది అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తే ఇందులో 20 మంది గెలిచారు. ఈ 20 మందిలో 17 మంది బీజేపీకి చెందిన వారు. ఓడిపోయిన వారిలో ఇద్దరు శివసేన అభ్యర్థులు ఉంటే, ఒకరు బీజేపీకి చెందిన వారు. మొత్తంగా యోగి ఆదిత్యనాథ్ స్ట్రయిక్ రేట్ ఇంచుమించు 95 శాతం ఉంది.