వాజపేయి() ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా వ్యవహరించిన లాల్‌ కృష్ణ అద్వానీ(Lal Krishna Adwani) అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna) అందుకోబోతున్నారు. బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అద్వానీ పార్టీ కోసం ఎంతో పాటుపడ్డారు. భారత రాజకీయాలలో భీష్మ పితామహునిగా పేరుగాంచిన అద్వానీ వివాహం విచిత్ర పరిస్థితుల్లో జరింది.

వాజపేయి(vajpayee) ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా వ్యవహరించిన లాల్‌ కృష్ణ అద్వానీ(Lal Krishna Advani) అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna) అందుకోబోతున్నారు. బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అద్వానీ పార్టీ కోసం ఎంతో పాటుపడ్డారు. భారత రాజకీయాలలో భీష్మ పితామహునిగా పేరుగాంచిన అద్వానీ వివాహం విచిత్ర పరిస్థితుల్లో జరింది. ఆయన పెళ్లి(Marriage) కమలతో(Kamala) జరిగింది. ప్రస్తుత పాకిస్తాన్‌లోని(Pakistan) సింధ్‌లో(sindh) కమల జన్మించారు. ఆమె అసలు పేరు కమలా జగత్యాని. దేశ విభజన తర్వాత కమల కుటుంబం ఢిల్లీకి వసల వచ్చింది. వారిది మధ్య తరగతి కుటుంబం. కమల చదువు ఢిల్లీలోనే సాగింది. చదవయ్యాక ఢిల్లీ పోస్టాఫీసులో ఉద్యోగం వచ్చింది. అదే సమయంలో కమలకు లాల్‌ కృష్ణ అద్వానీ నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. అప్పుడు లాల్‌ కృష్ణ అద్వానీ జర్నలిస్టుగా(Journalist) పని చేస్తుండేవారు. ప్యాంటుషర్టు వేసుకుని సైకిల్‌పై ఆఫీసుకు వెళుతుండేవారు. అద్వానీ పెళ్లి ప్రతిపాదన తెచ్చేసరికి కమల కాదనలేకపోయారు. అలా వారిద్దరి వివాహం 1965, ఫిబ్రవరి 25న జరిగింది. అద్వానీ జీవితంలోకి ఆమె ప్రవేశించిన తర్వాత ఆయన కష్టసుఖాలలో భాగమయ్యారు. ఆయన వెన్నంటి నడిచారు. ఆయన తినే ఆహారం నుంచి , ఆయనను ఎవరెవరు కలుసుకుంటారనేదానిపై కమల దృష్టి పెట్టేవారు. ఆయన అరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేవారు.

Updated On 3 Feb 2024 4:16 AM GMT
Ehatv

Ehatv

Next Story