కపిలవస్తు దేశానికి మహారాజైన శుద్ధోధనుడు(Suddhodana)- మాయదేవి(Mayadevi) దంపతుల ముద్దు బిడ్డ సిద్ధార్థుడు(Siddhartha). సిద్ధార్థుడు తల్లి గర్భమున ఉన్నప్పుడు మాయాదేవి ఓ కల కంటుంది.. ఆరు దంతాలున్న ఓ ఏనుగు తన గర్భములోనికి కుడివైపు నుంచి ప్రవేశించినట్టుగా ఆమెకు కల వస్తుంది. తొలి పురుడు పుట్టింట్లోనే జరగాలన్నది శాక్యవంశ ఆచారం.. గర్భవతిగా ఉన్న మాయాదేవి ప్రసవానికి ముందు తల్లిగారింటికి బయలుదేరుతుంది.. మార్గమధ్యంలో లుంబిని(Lumbini) అనే ప్రాంతంలో ఆమెకు నొప్పులు వస్తాయి.. అక్కడే ఓ సాల వృక్షం(Sal tree) కింద ఆమె మగబిడ్డకు జన్మనిస్తుంది.. బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే మాయాదేవి కన్నుమూస్తుంది.

కపిలవస్తు దేశానికి మహారాజైన శుద్ధోధనుడు(Suddhodana)- మాయదేవి(Mayadevi) దంపతుల ముద్దు బిడ్డ సిద్ధార్థుడు(Siddhartha). సిద్ధార్థుడు తల్లి గర్భమున ఉన్నప్పుడు మాయాదేవి ఓ కల కంటుంది.. ఆరు దంతాలున్న ఓ ఏనుగు తన గర్భములోనికి కుడివైపు నుంచి ప్రవేశించినట్టుగా ఆమెకు కల వస్తుంది. తొలి పురుడు పుట్టింట్లోనే జరగాలన్నది శాక్యవంశ ఆచారం.. గర్భవతిగా ఉన్న మాయాదేవి ప్రసవానికి ముందు తల్లిగారింటికి బయలుదేరుతుంది.. మార్గమధ్యంలో లుంబిని(Lumbini) అనే ప్రాంతంలో ఆమెకు నొప్పులు వస్తాయి.. అక్కడే ఓ సాల వృక్షం(Sal tree) కింద ఆమె మగబిడ్డకు జన్మనిస్తుంది.. బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే మాయాదేవి కన్నుమూస్తుంది. సిద్ధార్థుండంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్థం. ఆ సిద్ధార్థుడే గౌతమ బుద్ధుడు(Goutham budha). మన దగ్గర బుద్ధునికి సంబంధించిన ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. బుద్ధుడు నిర్వాణం చెందిన కుషీ నగరం(Kushi nagar) మన దేశంలోనే ఉంది. బౌద్ధ జాతక కథల్లో కుషీనగర్‌ను కుషావతి(Kushvathi) అన్నారు. ప్రాచీన భారతంలో మల్లరాజ్యానికి కుషావతి కేంద్రం. హిరణ్యావతి నది తీరంలో ఉన్న కుషావతి కాలక్రమంలో కుషానారాగా మారింది. ఇప్పుడు కుషీనగర్‌ అయ్యింది.. అశోకుడి పాలనలో ఇక్కడ ఎన్నో కట్టడాలు నిర్మితమయ్యాయి. గౌతముడు బోధి వృక్షం కింద జ్ఞానాన్ని సముపార్జించిన ప్రాంతమే బోధ్‌ గయా! మనమేమో బుద్ధగయ అంటాం. చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక బౌద్ధ ఆశ్రమాలు ఉన్నాయి. క్కడున్న ప్రధాన ఆశ్రమాన్ని బోధిమానంద విహారగా పిలుచుకుంటారు. మహాబోధి ఆలయం అని కూడా అంటారు. మహాబోధి ఆలయాన్ని ఆశోకుడు కట్టించాడంటారు కొందరు. మరికొందరేమో ఒకటో శతాబ్దంలో కుషాణులు నిర్మించారంటారు. బోధి వృక్షం కింద మూడు పగళ్లు, మూడు రాత్రులు గౌతముడు ధ్యానం చేశాడు. జ్ఞానాన్ని పొందాడు.. బుద్ధుడయ్యాడు..బుద్ధగయ ఫల్గు నది తీరంలో ఉంది. పాట్నాకు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుద్ధ గయలో నేపాల్‌, భూటాన్‌, టిబెట్‌, చైనా, జపాన్‌, మయన్మార్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌, వియత్నాంలకు చెందిన బౌద్ధ ఆశ్రమాలు ఉన్నాయి. 2002లో బుద్ధగయను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ఇక్కడ బుద్ధపూర్ణమ వేడుకలు చాలా గొప్పగా జరుగుతాయి.

Updated On 23 May 2024 4:16 AM GMT
Ehatv

Ehatv

Next Story