ఇవాళే సుబ్రహ్మణ్య షష్టి(Subrahmanya Sashti). ప్రతి నెలలో షష్టి తిథి వస్తుంది కానీ మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి తిథినే సుబ్రహ్మణ్య షష్టి అంటారు. పరమశివుడి(God Shiva) రెండో కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి. ఈయనకు అనేక పేర్లు ఉన్నాయి. కుమారస్వామి అన్నా, కార్తీకేయుడు అన్నా, స్కందుడు అన్నా, షణ్ముఖుడు అన్నా, మురుగన్‌ అన్నా, కుమరన్‌ అన్నా, శరవణన్‌ అన్నా, గుహూడు అన్నా ఈయనే! మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టిగా జరుపుకుంటారు. దీనిని చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్టిగా పిలుచుకుంటారు. తమిళులు దీనిని స్కంద షష్ఠి అని కూఆ అంటారు. మార్గశిర శుద్ధ షష్ఠినాడు స్వర్గలోకాధిపతి దేవేంద్రుడు(God Indra) దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామికి అత్యంత వైభవంగా పెళ్లి(Marriage) జరిపిస్తాడు. ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తున్నాము.
కుమారస్వామి వృత్తాతం ఆసక్తకరం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను భయభ్రాంతులను చేస్తూ ప్రజలను, దేవతలను పీడిస్తుండేవాడు. అతడు పెట్టే బాధలు భరించలేక దేవతలు బ్రహ్మదేవుడిని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారికి ఓ సూచన చేశాడు

ఇవాళే సుబ్రహ్మణ్య షష్టి(Subrahmanya Sashti). ప్రతి నెలలో షష్టి తిథి వస్తుంది కానీ మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి తిథినే సుబ్రహ్మణ్య షష్టి అంటారు. పరమశివుడి(God Shiva) రెండో కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి. ఈయనకు అనేక పేర్లు ఉన్నాయి. కుమారస్వామి అన్నా, కార్తీకేయుడు అన్నా, స్కందుడు అన్నా, షణ్ముఖుడు అన్నా, మురుగన్‌ అన్నా, కుమరన్‌ అన్నా, శరవణన్‌ అన్నా, గుహూడు అన్నా ఈయనే! మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టిగా జరుపుకుంటారు. దీనిని చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్టిగా పిలుచుకుంటారు. తమిళులు దీనిని స్కంద షష్ఠి అని కూఆ అంటారు. మార్గశిర శుద్ధ షష్ఠినాడు స్వర్గలోకాధిపతి దేవేంద్రుడు(God Indra) దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామికి అత్యంత వైభవంగా పెళ్లి(Marriage) జరిపిస్తాడు. ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తున్నాము.
కుమారస్వామి వృత్తాతం ఆసక్తకరం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను భయభ్రాంతులను చేస్తూ ప్రజలను, దేవతలను పీడిస్తుండేవాడు. అతడు పెట్టే బాధలు భరించలేక దేవతలు బ్రహ్మదేవుడిని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారికి ఓ సూచన చేశాడు. తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు అని, బలశాలి అని చెబుతూ అతడిని చంపడం మనవల్ల కాదని తేల్చేస్తాడు బ్రహ్మదేవుడు. ఈశ్వర తేజాంశ సంభవుడి చేతిలోనే ఈ రాక్షసుడు చస్తాడని అంటాడు. 'మీరు శివుడికి, హిమంతుడి పుత్రిక అయిన పార్వతీదేవితో పెళ్లి జరిపించండి. వారికి కలిగే పుత్రుడే తారకాసురుడిని సంహరించగలడు' అని బ్రహ్మదేవుడు వారికి తరుణోపాయం చెబుతాడు. దాంతో శివుడిని భక్తితో మెప్పించి, ఒప్పించి పార్వతిదేవితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును అగ్నిదేవుడిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేస్తున్న షట్‌ కృత్తికల దేవతల గర్భంలోకి ఆ తేజం ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజాన్ని భరించలేక వారు పొదలలో విసర్జిస్తారు. ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, ఆరుముఖాలు ఉన్నవాడు కావడం చేత అగుటవల్ల షణ్ముఖుడని, కార్తీకేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడు కావడంతో కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో స్వామిని కొలుస్తున్నాము. కారణజన్ముడైన ఈ బాలుడిని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమిస్తారు. శివుడు శూలాన్ని ఇస్తాడు. పార్వతిదేవి(Parvathi Devi) శక్తి అనే ఆయుధాలను ఇస్తుంది. అతడిని సర్వశక్తివంతుడిగా తీర్చిదిద్దుతుంది. ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనపై విరుచుకుపడతాడు. వారందరినీ ఒకేసారి సంహరించడనికి సర్పరూపం ధరించి ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. తారకాసురుడిని సంహరిస్తాడు.
ఈ రోజున శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు, చర్మ వ్యాధులు(Skin Disease) తగ్గుతాయని, పెళ్లి(Marriage) కాని వారికి వివాహం జరిగి సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీస్వామివారిసహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం రోజున భక్తులు ఉదయాన్నే స్నానం చేసి నిరాహారంగా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళతారు. పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. కుజ దోషం, కాలసర్ప దోషం కారణంగా సకాలంలో పెళ్లి కాని వారు సుబ్రహ్మణ్యషష్ఠి రోజున స్వామివారికి కళ్యాణాలు చేయిస్తారు. తమిళనాడులో కావడి మొక్కును తీర్చుకుంటారు. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది.

Updated On 18 Dec 2023 3:48 AM GMT
Ehatv

Ehatv

Next Story