సంక్రాంతి(sankranti) పండుగను మనమే కాదు, దేశమంతటా జరుపుకుంటారు. కాకపోతే పేర్లు వేరు, ఆచారాలు వేరు, పద్దతులు వేరు. తెలుగువారికి మాత్రం ఇది చాలా పెద్ద పండుగ. సంక్రాంతి రాగానే తెలుగు ఇళ్లకు కొత్త శోభ వస్తుంది.

సంక్రాంతి(sankranti) పండుగను మనమే కాదు, దేశమంతటా జరుపుకుంటారు. కాకపోతే పేర్లు వేరు, ఆచారాలు వేరు, పద్దతులు వేరు. తెలుగువారికి మాత్రం ఇది చాలా పెద్ద పండుగ. సంక్రాంతి రాగానే తెలుగు ఇళ్లకు కొత్త శోభ వస్తుంది. మూడు రోజుల పాటు సంబరంగా, సందడిగా జరిగే సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజు భోగి(Bhogi) పండుగ. సంక్రాంతి సమయంలో సూర్యుడు(sun) దక్షిణాయనం నుంచి ఉత్తరాయనంలోకి ప్రవేశిస్తుంటాడు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. తట్టుకోలేనంత చలి వేస్తుంటుంది.

ఆ చలిని తరిమివేయడానికే భోగిమంటలు వేసుకుంటారు. భోగి మంటలు వేయడం వెనుక ఓ పురాణ కథ(Histoy) కూడా ఉంది. బలిచక్రవర్తి(Bali charavarti) గాధ తెలిసిందే కదా! మహా విష్ణువు వామన అవతారంలో వచ్చి ఆ మహాదాతను పాతాళానికి తొక్కేసిన తర్వాత ఓ వరం ఇస్తాడు. బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని, సంక్రాంతి పండుగ వేళల్లో భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించే వరాన్నిఇస్తాడు. ఆ మహాబలిని ఆహ్వానించడానికే ప్రజలు భోగి మంటలు వేస్తారని పురాణాలు చెబుతున్నాయి. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందట! భగ అంటే మంటలన్నమాట! భోగి రోజు వేసే మంటలు కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాదు.

ఆరోగ్యదాయిని కూడా! ధనుర్మాసంలో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంటి ముందు పిడకలను కాలుస్తారు. తద్వారా గాలి శుభ్రం అవుతుంది. సూక్ష్మజీవులు(Germs) మటుమాయం అవుతాయి. భోగి మంటలలో రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరళ్లను వేస్తుంటారు. ఇంట్లో ఉన్న పాత కలపను కూడా వాడతారు. మంటల్లో ఆవు నెయ్యిని వేస్తారు. వీటిని కాల్చినప్పుడు వచ్చిన గాలిని పీల్చడం వల్ల శరీరంలో 72 వేల నాడులు(Nerves) ఉత్తేజితం అవుతాయట! చాలా మంది భోగిమంటల్లో టైర్లు, రబ్బర్‌, ప్లాస్టిక్‌ వస్తువులను వేస్తుంటారు. అది చాలా తప్పు. శాస్త్ర విరుద్ధం. పైగా వాతావరణం పాడవుతుంది. ఆ గాలి పీల్చడం వల్ల రోగాలు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది.

Updated On 13 Jan 2024 6:24 AM GMT
Ehatv

Ehatv

Next Story