Clock Stop Rule : వరల్డ్ కప్‌లో స్టాప్ క్లాక్ నిబంధన.. ఈ కొత్త రూల్ గురించి తెలుసా?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ క్రికెట్‌లో(Cricket) కూడా మార్పులు చేర్పులు వస్తున్నాయి. ఇంతకు ముందు అన్ని నిర్ణయాలు ఫీల్డ్ అంపైర్లే తీసుకునేవారు. ఇప్పుడు వారి పని సగానికి సగం తగ్గింది. రనౌట్‌ల నిర్ణయం టీవీలు చూసి తీసుకోవడమనేది ఎప్పుడో మొదలయ్యింది. ఇక డీఆర్‌ఎస్ ఎంత పాపులరయ్యిందో మనం చూస్తూనే ఉన్నాం. త్వరలో మరో కొత్త రూల్ రాబోతున్నది. ఇంతకాలం ప్రయోగ దశలో ఉన్న స్టాప్ క్లాక్ రూల్‌ను(Stop clock Rule) ఐసీసీ ఇంప్లిమెంట్ చేయబోతున్నది.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ క్రికెట్‌లో(Cricket) కూడా మార్పులు చేర్పులు వస్తున్నాయి. ఇంతకు ముందు అన్ని నిర్ణయాలు ఫీల్డ్ అంపైర్లే తీసుకునేవారు. ఇప్పుడు వారి పని సగానికి సగం తగ్గింది. రనౌట్‌ల నిర్ణయం టీవీలు చూసి తీసుకోవడమనేది ఎప్పుడో మొదలయ్యింది. ఇక డీఆర్‌ఎస్ ఎంత పాపులరయ్యిందో మనం చూస్తూనే ఉన్నాం. త్వరలో మరో కొత్త రూల్ రాబోతున్నది. ఇంతకాలం ప్రయోగ దశలో ఉన్న స్టాప్ క్లాక్ రూల్‌ను(Stop clock Rule) ఐసీసీ ఇంప్లిమెంట్ చేయబోతున్నది. జూన్‌లో వెస్టిండీస్, అమెరికా దేశాలలో జరిగే టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024)తో ఈ నిబంధనను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురాబోతున్నది. ఈ విషయాన్ని ఐసీసీ తాజాగా వెల్లడించింది.నిరుడు డిసెంబర్ నుంచి స్టాప్ క్లాక్ రూల్‌ను ప్రయోగాత్మకంగా పలు మ్యాచుల్లో అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధన బాగా వర్కవుట్ కావడంతో ఐసీసీ దీన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తేచ్చేందుకు రెడీ అయ్యింది. స్టాప్ క్లాక్ రూల్ నిబంధనలో ఓవర్‌కు ఓవర్‌కు మధ్య ఎలక్ట్రానిక్ గడియారాన్ని చూపిస్తారు. నిర్ణీత సమయంలోపు ఓవర్ల కోటాను పూర్తి చేసేలా రెండు జట్ల కెప్టెన్లకు ఆ క్లాక్ అప్రమత్తం చేస్తుందన్నమాట! అలాగే ఫీల్డింగ్ జట్టుకు ఓవర్ల మధ్య 60 సెకన్ల సమయం ఉంటుంది. స్టాప్ క్లాక్‌లో సున్నా వచ్చే లోపు మరో బౌలర్ ఓవర్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇలా వన్డేలు, టీ20ల్లో ప్రతి ఓవర్ తర్వాత స్టాప్ క్లాక్‌ను చూపిస్తారు. ఒకవేళ నిర్ణీత సమయంలోపు కొత్త ఓవర్ వేయకుంటే పెనాల్టీ విధిస్తారు. అన్నట్టు స్టాప్ క్లాక్ నియమాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అంపైర్లదే. ఓవర్ పూర్తికాగానే థర్డ్ అంపైర్ టైమర్ ఆన్ చేస్తాడు. 60 సెకన్ల లోపు బౌలింగ్ జట్టు కొత్త ఓవర్ వేయాలి. ఒకవేళ అలా చేయలేకపోతే ఫీల్డ్ అంపైర్ రెండు సార్లు హెచ్చరిస్తాడు. అయినా సరే సమయంలోపు ఓవర్ వేయకుంటే చివరకు అయిదు పరుగుల పెనాల్టీ విధిస్తాడు థర్డ్ అంపైర్.