ఆషాఢంలో కొత్త దంపతులు ఎందుకు కలవకూడదు?

మనకు సంప్రదాయాలు, ఆచారాలు ఎక్కువే! అందులో ఆషాఢమాసంలో(Ashada masam) అత్తాకోడళ్లు ఒక గడప దాటకూడదని, అత్తా అల్లుళ్లు ఒకరికొకరు ఎదురుపడకూడదని, కొత్త దంపతులు కలవకూడదని పెద్దలు చెబుతుంటారు. అనాదిగా దీన్ని పాటిస్తున్నారు కూడా! మన పెద్దలు చెప్పే ప్రతీ విషయంలో ఓ గూఢార్థం ఉంటుంది. ఓ పరామర్థం ఉంటుంది. ఆషాఢంలో కొత్త దంపతులు కలవకూడదనడానికి ఓ కారణం ఉంది. వెనుకటి రోజుల్లో కొత్తగా పెళ్లయిన వరుడు ఆరునెలల పాటు అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. సాధారణంగా వ్యవసాయపనులన్నీ ఆషాఢంలనే ప్రారంభమవుతాయి. ఇలాంటి సమయంలో వ్యవసాయపనులు(Harvesting) చేయవలసిన యువకులు అత్తాగారింట్లో ఉంటే పనులు ఎవరు చేయాలి? సకాలంలో పనులు జరగకకపోతే పంటలు ఎలా పండుతాయి? రైతు ఎలా బతకాలి? పైగా ఇప్పటిలా అప్పుడు కాల్వలు లేవు. అన్ని వర్షాధారిత పంటలే. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే వృధా అవుతుంది. అందుకే ఆషాఢంలో కొత్త కొడలు పుట్టింట్లో ఉండాలనే నియమం పెట్టారు. అల్లుడు కూడా అత్తారింటికి వెళ్లకూడదని చెప్పారు. ఆషాఢంలో కొత్త దంపతులు కలిస్తే ఆ ముచ్చటా ఈ ముచ్చటా తీర్చుకుంటారు కదా! అలాంటప్పుడు అమ్మాయి నెలతప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆషాఢంలో ప్రెగ్నెన్సీ వస్తే ప్రసవం మండు వేసవిలో జరుగుతుంది. నవజాత శిశువు పెరగడానికి అది మంచి వాతావరణం కాదు. అందుకే పెద్దలు బాగా ఆలోచించి ఈ నియమం పెట్టారు.

Eha Tv

Eha Tv

Next Story