గత రెండు రోజులుగా రేవ్‌ పార్టీ(Rave Party) గురించి అటు మెయిన్ మీడియా, ఇటు సోషల్‌ మీడియాలో(Social media) వార్తల గలగలలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒక్క నగరాలే అని కాదు పట్టణాల్లో కూడా ఈ కల్చర్‌ విస్తరించింది. అసలు ఈ రేవ్‌ పార్టీ అంటే ఏంటి? రేవ్‌పార్టీలో ఏమేమి ఉంటాయి.. ఇందులో ఏం చేస్తారు? ఎందుకు పోలీసులు పట్టుకుంటారు? ఇలాంటి విషయాలపై నెటిజన్లకు ఆసక్తి నెలకొంది. అయితే రేవ్‌ పార్టీ కల్చర్‌ 1950ల్లో ఇంగ్లండ్‌లో(england) ప్రారంభమైంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.

గత రెండు రోజులుగా రేవ్‌ పార్టీ(Rave Party) గురించి అటు మెయిన్ మీడియా, ఇటు సోషల్‌ మీడియాలో(Social media) వార్తల గలగలలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒక్క నగరాలే అని కాదు పట్టణాల్లో కూడా ఈ కల్చర్‌ విస్తరించింది. అసలు ఈ రేవ్‌ పార్టీ అంటే ఏంటి? రేవ్‌పార్టీలో ఏమేమి ఉంటాయి.. ఇందులో ఏం చేస్తారు? ఎందుకు పోలీసులు పట్టుకుంటారు? ఇలాంటి విషయాలపై నెటిజన్లకు ఆసక్తి నెలకొంది. అయితే రేవ్‌ పార్టీ కల్చర్‌ 1950ల్లో ఇంగ్లండ్‌లో(england) ప్రారంభమైంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. అయితే మొదట్లో ఈ పార్టీల్లో మ్యూజిక్‌, డ్యాన్స్‌, మద్యం తాగుతూ ఎంజాయ్‌ చేసేవారు. లండన్‌లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను ‘రేవ్ పార్టీలు’ అని పిలుస్తారు. ఆ తర్వాత ఈ పార్టీ కల్చర్‌ ఖండాంతరాలు విస్తరిస్తూ రూపాంతరం చెందింది. ఏదైనా క్లోజుడ్‌ ప్రదేశంలో, పెద్ద హాల్‌లో చెవులు పగిలిపోయే మ్యాజిక్‌ పెట్టుకుని మంద్యం సేవిస్తూ పార్టీ చేసుకునే వారు. డ్యాన్స్ పార్టీ(Dance) కాస్తా రేవ్ పార్టీగా మారి పోయింది. మన దేశంలో మాదక ద్రవ్యాల(Drugs) నిరోధక(ఎన్‌డీపీఎస్‌) చట్టం ప్రకారం గంజాయికి(Weed) కొకైన్(cocine), ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ మొదలైన మత్తుపదార్థాలు , మాదకద్రవ్యాల వాడకం నిషేధం.

మన దేశంలో గోవా నుంచి ప్రారంభమైంది. ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ-ఎన్‌సిఆర్ నగరాల్లో ఈ పార్టీ కల్చర్‌ వచ్చింది. ఈ సంస్కృతి హైదరాబాద్‌ నగరంలో కూడా విస్తరించింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్ లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్‌స్పాట్‌లుగా నిలిచాయి. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM) ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీలు పలు రకాలుగా ఉంటాయి. సాధారణంగా రేవ్ పార్టీలు చాలా ఖరీదుతో కూడుకున్నవి. ఈ పార్టీల్లో గోప్యత కూడా ముఖ్యమైనదిగా భావిస్తారు. అందుకే పెద్ద తలకాయలు, సెలబ్రిటీలు, సినీతారలు ఎంజాయ్‌మెంట్‌ కోసం ఇక్కడికి వస్తుంటారు. డ్యాన్స్, ఫన్, ఫుడ్‌, మద్యంతోపాటు, డ్రగ్స్‌కూడా లభ్యమవుతాయి. ఫుడ్‌, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా, కొకైన్, హషిష్, చరాస్, ఎల్‌ఎస్‌డి, మెఫెడ్రోన్ తదితర డ్రగ్స్‌ కూడా దొరుకుతాయని చెప్తారు. కొన్ని రేవ్ పార్టీలలో లైంగిక కార్యకలాపాల కోసం ప్రత్యేక గదులు కూడా ఉంటాయట అందుకే సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్తారు.

క్రమక్రమంగా ఈ రేవ్‌ పార్టీ కల్చర్‌ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వేదికైంది. మద్యంతో పాటు అమ్మాయిల న్యూడ్‌ డ్యాన్స్ చేయించడం, యాంఫేటమిన్, ఎల్‌ఎస్‌డీ, కెటామైన్, మెథాంఫేటమిన్ , కొకైన్ , గంజాయి లాంటి మాదకద్రవ్యాల వాడకం స్టార్ట్ చేశారు. ఇలాంటి చట్టవ్యతిరేక రేవ్‌ పార్టీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆ పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని, నిర్వహకులను అరెస్ట్‌ చేస్తారు. ఇవి చట్టవ్యతిరేక పార్టీలు అని తెలిసినా ఈ పార్టీలో సెలెబ్రిటీలు పాల్గొనడం గమనార్హం

Updated On 21 May 2024 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story