పదునాలుగేండ్ల వనవాసం తర్వాత దుష్టశిక్షణ గావించి అయోధ్యకు(Ayodhya) తరలివస్తున్న రాముడి(Lord Rama) కోసం ప్రజలు ఎలా ఎదురుచూశారో ఇప్పుడ అయోధ్యలోని రామాలయంలో(Ram mandhir) రాముడి ప్రతిష్టాపన కార్యక్రమం కోసం అలాగే ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న జరిగే విగ్రహ ప్రతిష్టాపన(Idol Installation) కార్యక్రమం కోసం దేశం సన్నద్ధమవుతోంది.

పదునాలుగేండ్ల వనవాసం తర్వాత దుష్టశిక్షణ గావించి అయోధ్యకు(Ayodhya) తరలివస్తున్న రాముడి(Lord Rama) కోసం ప్రజలు ఎలా ఎదురుచూశారో ఇప్పుడ అయోధ్యలోని రామాలయంలో(Ram mandhir) రాముడి ప్రతిష్టాపన కార్యక్రమం కోసం అలాగే ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న జరిగే విగ్రహ ప్రతిష్టాపన(Idol Installation) కార్యక్రమం కోసం దేశం సన్నద్ధమవుతోంది. ప్రధాని నరేంద్రమోదీతో(Narendra modi) పాటు దేశంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రామనంది(Ramanandi) అనే సంప్రదాయంలో అయోధ్య రామాలయంలో పూజలు జరుగుతాయి. భవిష్యత్తులో కూడా ఇదే సంప్రదాయం కొనసాగుతుంది. ఇంతకీ రామనంది సంప్రదాయంలోని నియమ నిబంధనలు ఏమిటి? అసలు ఈ శాఖను ఎవరు స్థాపించారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం!
జగద్గురు శ్రీ రామానందాచార్య స్థాపించిన రామనంది శాఖ బైరాగిల నాలుగు పురాతన శాఖలలో ఒకటి. దీనిని బైరాగి శాఖ, రామవత్ శాఖ, శ్రీ శాఖ అని కూడా అంటారు. కాశీలోని(Kashi) పంచగంగా ఘాట్(Panchganga Ghat) దగ్గర రామనంది శాఖకు చెందిన పురాతన మఠం కూడా ఉంది. ఈ శాఖకు చెందిన వారు ప్రధానంగా శ్రీరాముని పూజిస్తారు. ఈ శాఖలోని వారు ఓం శ్రీరామాయ నమః అనే మంత్రాన్ని జపిస్తారు. ఈ శాఖను అనుసరించేవారు శుక్లశ్రీ, బిందుశ్రీ, రక్తశ్రీ మొదలైన తిలకాలను ధరిస్తారు. రామనంది శాఖకు శ్రీరాముడు ప్రధాన దైవం. ఈ వర్గానికి చెందిన వారు బాలునిరూపంలోని శ్రీరాముని పూజిస్తారు. అంటే చిన్నపిల్లలను ఎంత అల్లారుముద్దుగా చూసుకుంటారో అదే విధంగా భగవంతుని పూజిస్తారు. పూజా విధానంలో ప్రతి రోజూ బాలరాముడిని ఆకర్షణీయంగా అలంకరిస్తారు. శ్రీరాముని చిన్న పిల్లవానిగా భావిస్తారు. ఉదయాన్నే మేలుకొలుపుతారు. స్నానం చేయిస్తారు. గోరుముద్దలను తినిపిస్తారు. ఇవన్నీ పూజా విధానంలో భాగంగా ఆచరిస్తుంటారు. రామనంది శాఖ కొన్ని వందల ఏళ్లుగా అయోధ్యలోని రామాలయంలో పూజలు నిర్వహిస్తోంది. కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో కూడా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అనంతరం రామనంది వర్గానికి చెందిన పూజారులే ఇక్కడ అన్ని పూజలు చేస్తారు

Updated On 18 Dec 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story