మనిషి తన దైనందిక జీవితంలో ఎన్నో సంస్కారాలు చేయవలసి ఉంటుంది. మంచి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు శుభ ముహూర్తాలు(Auspicious Time) చూసుకుంటారు. మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది కాబట్టి శుభ ముహూర్తాలు ఉన్నట్టుగానే దుర్మూహూర్తాలు(inauspicious time) కూడా ఉంటాయి. వీటిపై కూడా అవగాహన ఉండాలి కదా! అప్పుడే కదా మనకు మంచి ముహూర్తమేమిటో తెలిసేది! నక్షత్ర ప్రమాణమును బట్టి విడువ తగిన కాలమును వర్జ్యం అంటారు. దినప్రమాణ ఆధారంగా , వారాన్ని బట్టి విడువ తగిన కాలమును దుర్మూహుర్తం, రాహూకాలము అంటారు.
మనిషి తన దైనందిక జీవితంలో ఎన్నో సంస్కారాలు చేయవలసి ఉంటుంది. మంచి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు శుభ ముహూర్తాలు(Auspicious Time) చూసుకుంటారు. మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది కాబట్టి శుభ ముహూర్తాలు ఉన్నట్టుగానే దుర్మూహూర్తాలు(inauspicious time) కూడా ఉంటాయి. వీటిపై కూడా అవగాహన ఉండాలి కదా! అప్పుడే కదా మనకు మంచి ముహూర్తమేమిటో తెలిసేది! నక్షత్ర ప్రమాణమును బట్టి విడువ తగిన కాలమును వర్జ్యం అంటారు. దినప్రమాణ ఆధారంగా , వారాన్ని బట్టి విడువ తగిన కాలమును దుర్మూహుర్తం, రాహూకాలము(Rahukalam) అంటారు. గ్రంథాలలో దుర్మూహుర్తమును మాత్రమే చెప్పారు. రాహుకాలంను గూర్చి చెప్పినట్లుగా లేదు. రాహు కాలమును తమిళులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మన ప్రాంతమున వర్జ్యము, దుర్మూహూర్తమును పాటిస్తే సరిపోతుంది.దుర్ముహూర్తం వారమునకు సంబంధించిన దోషము. ఇది సూర్యోదయం ఆరు గంటలయ్యేటప్పుడు దుర్మహూర్తం ఈ విధంగా వస్తుంది. దీని ప్రమాణం 48 నిమిషాలు, ఆదివారం సాయంత్రము 4-32 గంటలకు. సోమవారం మధ్యాహ్నం 12-28 మరల 2-58 గంటలకు మంగళవారం ఉదయం 8-30 గంటలకు, మళ్లీ రాత్రి 11-50 గటలకు, బుధవారం ఉదయం 11-41 గంటలకు, గురువారం మధ్యాహ్నం 2-54 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 12-28 గంటలకు శనివారం ఉదయం 2-40 గంటలకు దుర్మహూర్తం వస్తుంటుంది. ఘడియల్లో ఆదివారం-26, సోమవారం-16, 22 మంగళవారం-6 మళ్లీ రాత్రి 11-50 బుధవారం-11, గురువారం-10, శుక్రవారం,శనివారం-4 ఘడియలకు వస్తుంది.