మహాపర్వదినాలైన కల్పాది తిథులు, మన్వంతర తిథులు, దశావతార పుణ్య తిథులు మొదలైనవి ఉంటాయి. అలాగే పంచాంగం(Panchangam) అనేది అయిదు అంగాల కలియక.తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ మొదలైన అయిదు అంగములను పంచాంగం అంటారు. దీని ద్వారా భవిష్యత్తులో మనకు రానున్న విశేషాలు, పండుగలు(Festival), గ్రహణాలు(Eclipses), వర్ష వివరాలు(Rain), కాల నిర్ణయాలు, ఆ సంవత్సరంలో సాగే ధరవరలు, వర్షపాతములు మొదలైనవి తెలుసుకోవడం జరుగుతుందని పండితులు చెబుతారు.

మహాపర్వదినాలైన కల్పాది తిథులు, మన్వంతర తిథులు, దశావతార పుణ్య తిథులు మొదలైనవి ఉంటాయి. అలాగే పంచాంగం(Panchangam) అనేది అయిదు అంగాల కలియక.తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ మొదలైన అయిదు అంగములను పంచాంగం అంటారు. దీని ద్వారా భవిష్యత్తులో మనకు రానున్న విశేషాలు, పండుగలు(Festival), గ్రహణాలు(Eclipses), వర్ష వివరాలు(Rain), కాల నిర్ణయాలు, ఆ సంవత్సరంలో సాగే ధరవరలు, వర్షపాతములు మొదలైనవి తెలుసుకోవడం జరుగుతుందని పండితులు చెబుతారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది కాబట్టి ఆరోజున, సంవత్సర కాలం ఎలా ఉండబోతుందో తెలుసుకుంటారు.మనిషి ఏదైనా చెడు చేస్తే ఆ ఫలితాన్ని కచ్చితంగా అనుభవించాలి. ఇలాంటి కర్మ ఫలితాలని నెరవేర్చుకోవడానికి పంచాంగ శ్రవణం మనిషికి తోడ్పడుతుంది. దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి దారిచూపుతుంది. ఉగాది చైత్రశుద్ధ పాడ్యమిన వచ్చే పండుగ. 'ఉగము' అనగా నక్షత్ర గమనం అని అర్థం. 'ఉగాది' నుంచి నక్షత్ర గమనమును లెక్కిస్తారు. ఈ రోజున తలంటు స్నానం చేసి, వేపపువ్వు పచ్చడిని ఈశ్వరుడికి నివేదన చేసి ఆరగించాలి. సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలనే ఆంతర్యం ఆ పచ్చడిలో దాగి ఉంటుంది. శిశిరం తర్వాత వచ్చే నెల చైత్రం. పన్నెండు మాసాలలో శిశిరం చివరిది. అది ఆకురాలు కాలం. చైత్రం కొత్త చిగుళ్లు వేసే మాసం. మానవాళి కూడా తమకు జరిగిన మంచిని జ్ఞాపకాలుగా ఉంచుకొని, మిగిలిన సంఘటనలను చెట్లు తమ ఆకులు రాల్చుకున్నట్లుగా దులిపేసుకొని కొత్త ఆశయాలతో నూతన కాంతులతో చిగురించడమే ఉగాది పండుగ ప్రాశస్త్యం.

Updated On 8 April 2024 12:56 AM GMT
Ehatv

Ehatv

Next Story