ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఆతిశీ(Atishi) మర్లెనా సింగ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి.
ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఆతిశీ(Atishi) మర్లెనా సింగ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. ఆమె విద్యావంతురాలు, స్వచ్ఛమైన నాయకురాలు, అవినీతి, బంధుప్రీతిలకు చాలా దూరంగా ఉంటారు. ప్రస్తుతం ఆమె విద్యాశాఖ మంత్రిగా(Education minister) ఉన్నారు. దాంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి(AAP) జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా! కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఆమె విద్య, పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుకున్న ఆతిశీ న్యాయవాది కూడా! కల్కాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆతిశీ పర్యావరణ సమస్యలకు సంబంధిచిన పలు కేసుల పరిష్కారానికి కృషి చేశారు.
కేజ్రీవాల్, సిసోడియా అరెస్ట్ తర్వాత పార్టీని ముందుండి నడిపించిన ఈ 43 ఏళ్ల ఆతిశీ కేంద్ర వైఖరికి నిరసనగా దీక్ష చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో పరిధిలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఉన్నత విద్యావంతురాలు కావడంతో మనీశ్ సిసోడియా రాజీనామా తర్వాత విద్యా శాఖ బాధ్యతను ఈమెకు అప్పగించారు. న్యాయవాది కావడంతో సత్యేంద్ర జైన్ రాజీనామా తర్వాత న్యాయశాఖ బాధ్యతలను కూడా ఆతిశీకి అప్పగించారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం.. ఆతిశీ మొత్తం ఆస్తి కోటీ 41 లక్షల రూపాయలు. అవినీతిరహిత పాలనను అందించాలన్నది ఆమె లక్ష్యం!