బాబర్(Barbar) పాలనలో అయోధ్యలో నిర్మితమైన బాబ్రీ మసీదును(Masjid) కూల్చేసి అదే స్థలంలో ఇప్పుడు రామాలయం నిర్మితమవుతున్న విషయం తెలిసిందే! బాబర్ రాక కంటే ముందు అక్కడ రామాలయం(Temple) ఉండేది అని హిందూ సంఘాల నమ్మకం. బాబార్ ఏం చేశాడన్నది వదిలేస్తే ఆయన మనవడు అక్బర్(Akbar) చక్రవర్తి మాత్రం రాముడిపై తన భక్తిని చాటుకున్నాడు. శ్రీరాముడి నాణాన్ని(Coin) రూపొందించడమే కాకుండా పర్షియన్(Persian) భాషలోకి రామాయణాన్ని అనువదింపచేశాడు.
బాబర్(Barbar) పాలనలో అయోధ్యలో నిర్మితమైన బాబ్రీ మసీదును(Masjid) కూల్చేసి అదే స్థలంలో ఇప్పుడు రామాలయం నిర్మితమవుతున్న విషయం తెలిసిందే! బాబర్ రాక కంటే ముందు అక్కడ రామాలయం(Temple) ఉండేది అని హిందూ సంఘాల నమ్మకం. బాబార్ ఏం చేశాడన్నది వదిలేస్తే ఆయన మనవడు అక్బర్(Akbar) చక్రవర్తి మాత్రం రాముడిపై తన భక్తిని చాటుకున్నాడు. శ్రీరాముడి నాణాన్ని(Coin) రూపొందించడమే కాకుండా పర్షియన్(Persian) భాషలోకి రామాయణాన్ని అనువదింపచేశాడు. మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్‌పై శ్రీరాముడి ప్రభావం చాలా ఎక్కువగా ఉండింది. అప్పట్లో ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీ ప్యాలెస్‌లో(Fatehpur Sikri Palace) ఎర్ర ఇసుకరాయిపై శ్రీరాముడి ఆస్థానం చెక్కించాడు. అక్బర్ తల్లి హమీదాబాను బేగం ఉండే మరియమ్ మహల్‌లో(Mariyam mahal) ఓ స్తంభంపై రాముడి ఆస్థానంతో పాటు హనుమంతుడి చిత్రం కూడా కనిపిస్తుంది. అక్బర్ తల్లి హమీదా బాను బేగం రామాయణ, మహాభారత ఇతిహాసాలను అమితంగా ఇష్టపడేవారట! అందుకే ఆమె నివాసభవనంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడి చిత్రాలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని ఏఎస్‌ఐ మాజీ డైరెక్టర్, పురావస్తుశాస్త్రవేత్త పద్మశ్రీ కేకే ముహమ్మద్ చెబున్నారు. తన తల్లి ఆసక్తిని, భక్తిని గమనించిన అక్బర్ రామాయణం, మహాభారతాలను పర్షియన్ భాషలోకి అనువదింపజేశారని చరిత్ర చెబుతోంది. హమీదా బాను బేగం నివాస భవనంలో వేణుగోపాలుడు వేణువు వాయిస్తున్న పెయింటింగ్‌ను కూడా చూడొచ్చు.