నోటాకు(NOTA) 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తే ఏం జరుగుతుంది?ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఓటింగ్ పండుగ జోరుగా సాగుతోంది. ఓటు వేయడానికి జనం బాగానే కదులుతున్నారు. నచ్చిన అభ్యర్థికి ఓటేయడానికి ఉత్సాహపడుతున్నారు. కొందరు మాత్రం బరిలో నిలుచున్నవారెవ్వరూ నచ్చలేదంటూ నోటాకు వేస్తుంటారు. ఆ మాత్రం దానికి పోలింగ్ బూత్ వరకు రావడమెందుకు అంటే ఓటు వేయడం కర్తవ్యం కాబట్టి! ఆ సంగతి వదిలేస్తే ప్రజాస్వామ్యం దేశంలో తమకెవరూ నచ్చలేదని చెప్పుకునే హక్కు కూడా ఉంటుంది.
నోటాకు(NOTA) 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తే ఏం జరుగుతుంది?ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఓటింగ్ పండుగ జోరుగా సాగుతోంది. ఓటు వేయడానికి జనం బాగానే కదులుతున్నారు. నచ్చిన అభ్యర్థికి ఓటేయడానికి ఉత్సాహపడుతున్నారు. కొందరు మాత్రం బరిలో నిలుచున్నవారెవ్వరూ నచ్చలేదంటూ నోటాకు వేస్తుంటారు. ఆ మాత్రం దానికి పోలింగ్ బూత్ వరకు రావడమెందుకు అంటే ఓటు వేయడం కర్తవ్యం కాబట్టి! ఆ సంగతి వదిలేస్తే ప్రజాస్వామ్యం దేశంలో తమకెవరూ నచ్చలేదని చెప్పుకునే హక్కు కూడా ఉంటుంది. మొన్నామధ్యన మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) ఇండోర్‌లో(Indore) చిత్రం జరిగింది. కాంగ్రెస్(congress) పార్టీ తరఫున అక్కడ్నుంచి పోటీ చేసే అభ్యర్థి హఠాత్తుగా నామినేషన్‌ను ఉపసంహరించుకుని, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో(BJP) చేరి కనిపించకుండా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇండోర్‌లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థి లేకపోవడంతో భారతీయ జనతాపార్టీకి గుణపాఠం చెప్పాలనే కసితో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రోజు జరుగుతున్న నాలుగో దశ ఎన్నికల్లో కార్యకర్తలు, ప్రజలు నోటా గుర్తుకు ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తిచేసింది. నోటాకు ఓటు వేసి బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చింది. అయితే నోటాకు వేసినందువల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. 99 శాతం మంది ప్రజలు నోటాకు వేసినా, ఒక్కరు అక్కడ్నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేస్తే ఆ అభ్యర్థి గెలిచినట్టే! కాకపోతే ఏదైనా నియోజకవర్గంలో నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తే అక్కడి అభ్యర్థిని ప్రజలు ఎన్నుకోవడానికి ఇష్టపడలేదని తెలుస్తుంది. అప్పుడు దానిపై ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ అన్నారు.