రత్నగర్భ మన భారతదేశం. సకల సంపదలకు ఆలవాలమీ దేశం! అందుకే పరాయి దేశాలు మన మీద దాడులకు దిగాయి. దండయాత్రలు చేశాయి. సంపదను దోచుకెళ్లాయి. హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh)లోని కాంగ్‌డా కోట(Kangra Fort)పై చాలా మంది కన్నుపడింది. కచోట్‌ రాజ్యానికి చెందిన సుశర్మ చంద్ర 3,500 ఏళ్ల కిందట ఈ కోటను నిర్మించాడు.

రత్నగర్భ మన భారతదేశం. సకల సంపదలకు ఆలవాలమీ దేశం! అందుకే పరాయి దేశాలు మన మీద దాడులకు దిగాయి. దండయాత్రలు చేశాయి. సంపదను దోచుకెళ్లాయి. హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh)లోని కాంగ్‌డా కోట(Kangra Fort)పై చాలా మంది కన్నుపడింది. కచోట్‌ రాజ్యానికి చెందిన సుశర్మ చంద్ర 3,500 ఏళ్ల కిందట ఈ కోటను నిర్మించాడు. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన నిలిచి పోరాడాడు సుశర్మ చంద్ర. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత తన సేనలతో ఈ ప్రాంతానికి వచ్చాడు సుశర్మచంద్ర. శత్రువుల దాడుల నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం హిలాలయాలకు సమీపంలో భారీ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. అప్పట్లో ఎవరైనా లోపలికి ప్రవేశించాలని చూస్తే ద్వారపాలకులు వారి తల నరికేవారట! అందుకు కారణం కోటలోని అమూల్యమైన సంపదే!

ఈ సంపదను కొల్లగొట్టేందుకే 11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్‌(Gajini Mohammed) దండెత్తాడు. అక్బర్‌ చక్రవర్తి అయితే 52 సార్లు కాంగ్‌డాపై దాడి చేశాడు. ఏ ఒక్కసారి అతడు విజయం సాధించలేకపోయాడు. అక్బర్‌ కుమారుడు జహంగీర్‌ కూడా 14 నెలల పాటు యుద్ధం చేశాడు. అంతిమంగా గెలుపొందాడు. వేల సంవత్సరాలుగా అంతులేని నిధి నిక్షేపాలను కాంగ్‌డా కోట తన గర్భంలో దాచుకున్నది. ఈ కారణంగానే ఈ కోటపై చాలా మంది దండెత్తారు. అందినంత దోచుకెళ్లారు. పూర్తి స్థాయిలో ఈ కోటను దక్కించుకున్న రాజులెవ్వరూ లేరు. 465 ఎకరాల విస్తీర్ణంలో, ప్రకృతి సోయగాల మధ్య 11 ద్వారాలతో ఈ కోటను నిర్మించారు. శత్రు దుర్భేధ్యంగా ఉన్న ఈ కోట ఎన్నో భీకర దాడులకు ఎదురొడ్డి నిలిచింది. ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలబడగలిగింది. ఇప్పటికీ ఈ కోట ఎన్నో రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకుని ఉంది. కోట లోపల మొత్తం 21 బావుల నిండా లెక్కలేనంత సంపద ఉండేదని, కాలక్రమంలో కొందరు కోటపై దాడి చేసి వాటిని దోచుకెళ్లారని, అయినా ఇప్పటికీ ఎనిమిది బంగారు బావులు ఉన్నాయని అంటుంటారు.

అప్పట్లో కోటలోని ఆలయాలకు నిత్యం విలువైన బంగారు ఆభరణాలు, వజ్రవైడూర్యాలు గుట్టలుగా వచ్చిచేరేవి. అప్పటి పాలకులు భారీగా బంగారాన్ని దేవతలకు సమర్పించుకునేవారు. కొంత కాలానికి లెక్కించడానికి సాధ్యం కానంత సంపద పోగుపడింది. దీనంతటినీ కోటలో ఉన్న 21 బావుల్లో నిక్షిప్తం చేశారు. మహమ్మద్‌ గజనీ ఎనిమిది బావులను, బ్రిటీషు పాలకులు అయిదు బావులను దోచుకొని వెళ్లారు. అలా ఈ బంగారు బావుల సంపద కోసం కాంగ్‌డా కోట ఎన్నో దాడులను తట్టుకుంది. కానీ ఇప్పటికీ ఆ మిగిలిన ఎనిమిది బంగారు బావుల జాడ రహస్యంగానే మిగిలింది. వాటి కోసం చాలా మంది చాలా రకాలుగా విఫల ప్రయత్నాలు చేశారు. బావులన్నీ ఒకే చోట కాకుండా కోటలోని వివిధ ప్రాంతాలలో తవ్వించి అందులో నిధులను నిక్షిప్తం చేశారట! అందుకే మిగిలిన ఎనిమిది బావులు ఎక్కడున్నాయన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా ఉండిపోయింది. వాటి జాడ దొరికితే మాత్రం పంట పండినట్టే!

Updated On 25 Aug 2023 5:10 AM GMT
Ehatv

Ehatv

Next Story