కూల్చివేతలపై(Demolition)సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది.

కూల్చివేతలపై(Demolition)సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం నేరానికి పాల్పడిన వ్యక్తికి చెందినందున అతని ఆస్తులను కూల్చివేయలేమని తెలిపింది. ఒక వ్యక్తి దోషిగా తేలితే ఆస్తిని కూల్చివేయడం కూడా సాధ్యం కాదని కోర్టు పేర్కొంది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారి ఇళ్లపై అధికారులు తరచూ చేపట్టే బుల్డోజర్‌ కూల్చివేత చర్యలకు వ్యతిరేకంగా చేసిన అభ్యర్థనలను విచారించిన కోర్టు, వ్యక్తి దోషిగా నిర్ధారించబడినప్పటికీ ఆస్తిని కూల్చివేయలేమని తెలిపింది. అయితే పబ్లిక్ రోడ్లకు అడ్డుగా ఉన్న ఎలాంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడు అయినంత మాత్రాన ఎవరి ఇంటినైనా ఎలా కూల్చివేస్తారని సుప్రీంకోర్టు అధికారులను ప్రశ్నించింది. ఈ అంశంపై మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించింది. జస్టిస్‌ గవాయ్(Justice gavai), కేవీ విశ్వనాథన్‌(KV Viswanathan)లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నిర్మాణం చట్టవిరుద్ధమైతేనే అలాంటి కూల్చివేతలు జరుగుతాయని కోర్టు పేర్కొంది. ఇలాంటి కేసులను నివారించేందుకు ఆదేశాలు ఎందుకు జారీ చేయలేరని జస్టిస్ విశ్వనాథన్ ప్రశ్నించారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

ehatv

ehatv

Next Story