భారతదేశంలో(India) విడాకుల కేసులు(Divorce Cases) పెరుగుతున్నాయి,
భారతదేశంలో(India) విడాకుల కేసులు(Divorce Cases) పెరుగుతున్నాయి, గత రెండు దశాబ్దాలుగా అవి రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ధోరణికి వివిధ కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. అవేంటో తెలుసుకుందాం..
1. ఎక్కువ మంది మహిళలు వృత్తి జీవితంలో ప్రవేశించి.. ఆర్థికంగా స్వతంత్రంగా మారాక.. వైవాహిక జీవితంలో కాస్త సంతోషంగా లేకున్నా వివాహ బంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడట్ లేదు.
2. ఉన్నత స్థాయి విద్య(Education) కూడా విడాకులకు కారణమవుతుంది. మంచి చదువు కలిసుండాలనే అవగాహనను పెంచడానికి బదులు.. చిన్న చిన్న చిరాకులకు కూడా విడాకులు తీసుకోవడమే బెటర్ అనే ధోరణికి కారణమవుతుంది.
3. ఎక్కువగా పట్టణ ప్రాంతలలో(Urban Cities) విడాకులను ఆశ్రయిస్తున్నారు. ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ యాప్స్ వంటివి విరివిగా పెరిగి.. వివాహ బంధానికి ప్రత్యామ్నాయంగా తయారయ్యాయి.
4. భార్యభర్తలు ఉద్యోగులైతే(Employement).. వారి నెల సంపాదన వ్యత్యాసం కూడా జంటల విడాకులకు కారణం అవుతుంది.
5. కెరీర్‌పై ఒత్తిడి(Career Pressure) కూడా జంటలు విడిపోవడానికి ఓ కారణం. ముఖ్యంగా సినీ, ఫ్యాషన్ పరిశ్రమలోని జంటలలో ఈ తరహా విడాకులు చూస్తుంటాం.
6. పెరుగుతున్న వ్యభిచారం రేటు(Postitution) కూడా వైవాహిక బంధాలలో నమ్మకాన్ని సవాలు చేస్తుంటుంది. ఇది కూడా ఓ కారణంగా చెప్పొచ్చు.
7. నిర్లక్ష్యం, అజాగ్రత్త కూడా విడాకులకు కారణమవుతున్నాయి. అవి భావోద్వేగాలుగా మారి వివాహ బంధం విచ్ఛిన్నానికి దారి తీస్తాయి.
8. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా వైవాహిక బంధంలో కలహాలు సంభవిస్తాయి. పని ఒత్తిడితో జంటల మధ్య సమన్వయం లోపంతో వారి మధ్య గ్యాప్ పెరిగి విడాకుల వరకూ వెళ్తున్నారు.
9. పాశ్చాత్య పోకడ, సంస్కృతి ప్రభావాలు, సంప్రదాయ విలువలతో విభేదించడం వంటికి కూడా కొన్నిసార్లు విడాకులకు కారణాలు అవుతున్నాయి.