పచ్చగా ఉన్న భూమిని చూసి మనిషి ఓర్వలేకపోతున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లో(andhra Pradesh) తెలుగుదేశంపార్టీ(TDP) నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబునాయుడు(chandrababu) ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్‌ను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు చంద్రబాబును అభినందించాలి కూడా! కాకపోతే ఎన్టీఆర్ భరోసా(NTR Barosa) పేరిట గురువారం రెండో నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం తర్వాతే లబ్ధిదారులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. ఏపీలో పెన్షనర్ల(Pensioners) సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుండటాన్ని గమనించారు కొందరు. ఏపీలో పెద్ద సంఖ్యలో బోగస్ పెన్షన్లు(Bonus pensions) ఉన్నాయని కొంతకాలంగా టీడీపీ అనుకూల మీడియా రాస్తుండటం ఎందుకంటే ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికన్నమాట! రెండు నెలల కాలంలో 67,812 పెన్షనర్లు తగ్గిపోయారట! జులైలో 65 లక్షల 18 వేల 496 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ నెలకొచ్చేసరికి 64 లక్షల 39 వేల 41 మందికి తగ్గిపోయింది. ఏటీఆర్ కలిపితే ఆ సంఖ్య 64,82,052గా ఉంది. జులై కంటే ఆగష్టులో 79, 455 పెన్షన్లు తగ్గించి ప్రభుత్వం. లేటెస్ట్‌గా మంత్రి అచ్చెన్నాయుడు పెన్షనర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బోగస్ పెన్షనర్లను ఏరిపారేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమాన్ని అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు మాటలు పెన్షనర్లకు గుబులు పుట్టిస్తున్నాయి. ఇంకెన్ని కోతలుంటాయో వచ్చే నెల చూడాలి!