మనం బంధువుల పెళ్లిళ్లకు వెళ్తుంటాం. గుడులకు వెళ్తుంటాం. పెళ్లిళ్ల సమయంలో చివరిలో 1 ఉండేలా చదివింపులు చేస్తాం. గుడికి వెళ్లినా 11, 51, 101.. ఇలా హుండీలో వేస్తుంటాం. ఎన్ని రూపాయలు వేసినా అదనంగా రూపాయి నాణేన్ని పెడుతుంటాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన కుటుంబాలు నేటికీ పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలు చేసినప్పుడు కానుకలు ఇస్తుంటాం.
మనం బంధువుల పెళ్లిళ్లకు వెళ్తుంటాం. గుడులకు వెళ్తుంటాం. పెళ్లిళ్ల సమయంలో చివరిలో 1 ఉండేలా చదివింపులు చేస్తాం. గుడికి వెళ్లినా 11, 51, 101.. ఇలా హుండీలో వేస్తుంటాం. ఎన్ని రూపాయలు వేసినా అదనంగా రూపాయి నాణేన్ని పెడుతుంటాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన కుటుంబాలు నేటికీ పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలు చేసినప్పుడు కానుకలు ఇస్తుంటాం. ఇంకా పాత రోజుల్లో అయితే బంతి భోజనాలు పెట్టే సమయంలో పక్కనే ఓ ఇద్దరు వ్యక్తులు పుస్తకం బ్యాగ్ పట్టుకొని చదివింపులను రాస్తూ ఉంటారు. ఈ చదివింపుల్లో ఎక్కువ 1తో ఎండ అయ్యే నెంబర్ ఉంటుంది. అందులో 11 రూపాయల నుంచి చదివింపులు ప్రారంభమవుతుంటాయి. అంటే రూ. 11, రూ. 21, రూ. 51, రూ. 111 రాసి ఉండడాన్ని గమనించవచ్చు. కానీ ఇలా ఎందుకు చేస్తారో మన పూర్వీకులకు, పెద్దవారికి తెలిసి ఉండొచ్చు కానీ ఇప్పటి తరానికి దీని వెనుక ఉన్న లాజిక్ తెలియకపోవచ్చు.
అంతెందుకు కేసీఆర్(KCR) ప్రభుత్వం కూడా పెన్షన్ రూ.2 వేలు పెంచినప్పుడు దానిని రూ.2,016గా చేశారు. చాలా మంది సున్నాను శూన్యంగా భావిస్తారు. అందుకే కానుకలు ఇచ్చే మొత్తంపై అదనంగా ఒక రూపాయి ఇస్తారు. సున్నా ఉంటే ముగింపునకు సూచన అని.. 1 సంఖ్య ప్రారంభానికి సూచకమని అంటారు. చివరికి సున్నా ఉండే సంఖ్యలు విభజించడానికి వీలుగా ఉంటాయి. ఉదాహరణకు 10, 100, 500ను సులభంగా విభజించే అవకాశం ఉంటుంది. అదే 101, 501 లాంటి సంఖ్యలు విభజించడానికి అవకశాం లేదు. అందుకే కానుకల మొత్తంపై కూడా అదనంగా రూపాయి ఇస్తే వాటిని సంబంధాలు విడదీయరానివిగా ఉంటాయని నమ్ముతారు. అంతేకాకుండా నాణేలను నాణేలను లక్ష్మీ దేవితో పోలుస్తారు. నాణేలు ఇస్తే ఆ కుటుంబాన్ని లక్ష్మీదేవి కటాక్షిస్తుందని అంటారు. అదనంగా ఇచ్చే రూపాయి కచ్చితంగా నాణెం ఉండాలని చెప్తారు. శుభకార్యం చేసే వాళ్లకు జీరోతో ఉన్న నగదు ఇస్తే అక్కడితో ఆగిపోవాలన్న అర్థం వస్తుందని.. అదే 1తో ఉన్న నగదు ఇస్తే ఇలాగే ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు సంకేతమని భావిస్తారు.